Prabhas : రికార్డుల్లో రారాజు.. దానంలో కర్ణుడు.. అభిమానులకు దేవుడు.. మంచితనానికి మారుపేరు.. ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్..

అనేక రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా మారి రికార్డులకు రారాజుగా నెలకొన్నాడు.

Prabhas : రికార్డుల్లో రారాజు.. దానంలో కర్ణుడు.. అభిమానులకు దేవుడు.. మంచితనానికి మారుపేరు.. ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్..

Prabhas Birth Day Special Story His Records His Greatness his Kindness

Updated On : October 23, 2024 / 6:20 AM IST

Prabhas Birthday : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో దేశవ్యాప్తంగా, విదేశాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే మాస్ ఆడియన్స్ ని మెప్పించాడు. వర్షం సినిమాతో క్లాస్ ఆడియన్స్ ని మెప్పించాడు. ఛత్రపతి లాంటి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాకు పరిచయమై పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

ఆ తర్వాత వరుస భారీ సినిమాలతో విదేశాల్లో కూడా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ 1000 కోట్ల హిట్స్ కొట్టిన ప్రభాస్ మరో అరడజను సినిమాలను చేతిలో పెట్టుకొని బిజీగా ఉన్నాడు. ఫ్యాన్స్ ని మెప్పించడానికి అన్ని రకాల జానర్లలో భారీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.

Raja Saab : ప్ర‌భాస్ ‘రాజా సాబ్’ నుంచి హార‌ర్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది.. రేపే గ్లింప్స్ రిలీజ్‌

వర్షం, ఛత్రపతి సినిమాలతోనే రికార్డుల వేట మొదలుపెట్టిన ప్రభాస్ బాహుబలి 2 సినిమాతో ఎవ్వరూ సాధించలేని రికార్డులని సెట్ చేసి పెట్టాడు. బాహుబలి 2 ఓవరాల్ కలెక్షన్స్, కొన్ని ఏరియా కలెక్షన్స్, ఓవర్సీస్ కలెక్షన్స్.. ఇలాంటి అనేక రికార్డులు ఇప్పటివరకు ఇంకా ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. ఆ తర్వాత కూడా తన రికార్డులని కంటిన్యూ చేస్తూ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డ్ లతో పాటు అనేక రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా మారి రికార్డులకు రారాజుగా నెలకొన్నాడు.

ఓ పక్క ఇలా సినిమాలు అయితే మరో పక్క తన మర్యాదలతో అందర్నీ మెప్పిస్తున్నాడు. ప్రభాస్ భోజనం పెడితే ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే అందరికి తెలుసు. ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయనతో నటించిన వాళ్ళు ఆయన పెట్టిన ఫుడ్ గురించి గొప్పలు చెప్తూ మాట్లాడారు. ప్రభాస్ ఇంటికి వెళ్లినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాడు. ప్రభాస్ అక్షయ పాత్ర లాంటి వాడు అని పొగుడుతారు.

Image

ఇక దానంలో కూడా ప్రభాస్ కర్ణుడి రేంజ్ అంటారు. అందుకే కల్కి సినిమాలో కర్ణుడి పాత్ర వెతుక్కుంటూ ప్రభాస్ దగ్గరికి వచ్చిందేమో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయాలు చేసాడు ప్రభాస్. ఎక్కడ ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందించి కోట్లలో విరాళాలు ఇస్తుంటాడు. ఈ ఏడాది కేరళలో వయనాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు ప్రభాస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. ఇక చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ మంచితనానికి మారుపేరుగా నిలుస్తున్నారు ప్రభాస్. తన వద్దకు ఏ సినిమా సపోర్ట్ కోసం వచ్చినా ట్రైలర్, టీజర్ లాంచ్ లు చేస్తూ వాటి గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చిన్న సినిమాల పాలిట పెద్ద దిక్కు అయ్యారు ప్రభాస్.

ఇక అభిమానులకు ప్రభాస్ దేవుడే. ఆయన సినిమా వచ్చినా, పుట్టిన రోజు వచ్చినా థియేటర్స్ దేవాలయాలు అయిపోతాయి. అభిమానుల కేరింతలతో సెలబ్రేషన్స్ సందడిగా చేసుకుంటారు. కేక్ కటింగ్స్ తో పాటు సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేస్తారు ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

Image