Bahubali 3 : కచ్చితంగా బాహుబలి 3 ఉంది.. రాజమౌళితో సలార్ స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రభాస్..

ఈ ఇంటర్వ్యూలో సలార్ సినిమాతో పాటు KGF, బాహుబలి సినిమాల గురించి కూడా డిస్కషన్ వచ్చినట్టు తెలుస్తుంది.

Prabhas Comments on Bahubali 3 Movie in Rajamouli Salaar Special Interview

Bahubali 3 : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్(Salaar) సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ సీజ్ ఫైర్ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. సలార్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సలార్ సినిమాకి అసలు ప్రమోషన్స్ చెయ్యట్లేదు. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్, ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

కానీ కేవలం రాజమౌళి(Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ఆ ఇంటర్వ్యూ నుంచి ఓ ఫోటో బయటకి రాగా తాజాగా ఆ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారి ట్రెండ్ అవుతుంది.

ఈ ఇంటర్వ్యూలో సలార్ సినిమాతో పాటు KGF, బాహుబలి సినిమాల గురించి కూడా డిస్కషన్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రోమోలో పూర్తిగా చూపించకపోయినా హింట్ మాత్రం ఇచ్చారు. అయితే ప్రోమో చివర్లో ప్రభాస్.. అయితే కచ్చితంగా బాహుబలి 3 ఉంటుంది అని అన్నాడు. దీంతో ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Salaar Interview : సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్.. రాజమౌళితో సలార్ యూనిట్..

ప్రభాస్ కెరీర్ లో బాహుబలి ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. ప్రభాస్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. గతంలో కూడా దీనికి పార్ట్ 3 ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ప్రభాస్ నోటి నుండి బాహుబలి 3 మాట రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలనుంటే ఫుల్ ఉంటర్వ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ ఫుల్ ఇంటర్వ్యూ డిసెంబర్ 19న రిలీజ్ కానుంది.