Spirit: ప్రభాస్ దగ్గర కండీషన్స్ పనిచేయవా.. పాపం సందీప్ ప్లాన్ తప్పిందిగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల్లో స్పిరిట్(Spirit) ఒకటి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Spirit: ప్రభాస్ దగ్గర కండీషన్స్ పనిచేయవా.. పాపం సందీప్ ప్లాన్ తప్పిందిగా..

Prabhas damaged Sandeep Reddy Vanga's plan for Spirit movie

Updated On : December 6, 2025 / 12:36 PM IST

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యానిమల్ లాంటి వైలెంట్ హిట్ తరువాత సందీప్ చేస్తున్న సినిమా కావడం, అందులోను ప్రభాస్ హీరోగా చేయడంతో ముందునుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా స్పిరిట్(Spirit) సినిమాను ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. దాదాపు రెండేళ్ల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది.

Dookudu to Akhanda 2: దూకుడు నుంచి అఖండ 2 వాయిదా వరకు.. అసలు ఏం జరిగింది..

అయితే, ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట సందీప్ రెడ్డి వంగ. అందుకే కోసం గతంలో ఎన్నడూ లేని విదంగా ప్రభాస్ లుక్ ను సరికొత్తగా ప్లాన్ చేశాడట. ఈ విషయంలో ప్రభాస్ కి కండీషన్స్ కూడా పెట్టాడట. ఈ సినిమా షూటింగ్ అయ్యేంత వరకు పబ్లిక్ ఫంక్షన్స్, సినిమా ఈవెంట్స్ కి వెళ్లకూడదని చెప్పాడట. దానికి సరే అని తల ఊపిన ప్రభాస్ నెక్స్ట్ వీక్ లో జపాన్ లో కనిపించాడు. బాహుబలి ది ఎపిక్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ లో భాగంగా ప్రభాస్ తాజాగా జపాన్ వెళ్ళాడు. ఇందులో భాగంగా ఆయన జపాన్ ఫ్యాన్స్ తో ముచ్చటించారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ లుక్ లో ప్రభాస్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాడు. ఈ లుక్ స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా సెట్ చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తన్నాయి. సందీప్ ఎంతో సీక్రెట్ గా ఉంచాలన్న ప్రభాస్ లుక్ ఇలా వైరల్ అయ్యింది. మాటిచ్చిన ప్రభాస్ ఇలా వారం తిరగకుండానే దాటేశాడు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న లుక్ స్పిరిట్ లోనీదే అని గ్యారంటీ లేదు. ఎమైనా ప్రభాస్ లేటెస్ట్ లుక్ తో మాత్రం ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.