Dookudu to Akhanda 2: దూకుడు నుంచి అఖండ 2 వాయిదా వరకు.. అసలు ఏం జరిగింది..
బాలకృష హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.(Dookudu to Akhanda 2) భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.
Dookudu to Akhanda 2: A Complete Analysis of the Controversy
Dookudu to Akhanda 2: బాలకృష హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది. దీంతో, నందమూరి అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే, ఈ సినిమా ఆగిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నిజంగా మహేష్ బాబు సినిమా వల్లనే ఈ సినిమా ఆగిపోయిందా? ఈరోస్ సంస్థ చెప్తుంది ఏంటి?ఈరోస్-14 రీల్స్ సంస్థకి సమస్య ఎక్కడ వచ్చింది అనేది దాని గురించి క్లియర్(Dookudu to Akhanda 2) గా తెలుసుకుందాం.
అసలు ఈ కథ మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాతో మొదలయ్యింది. ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ ఈరోస్ సంస్థతో కలిసి నిర్మించింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. లాభాలు కూడా బాగానే వచ్చాయి. అయితే, ఆ సమయంలో 14 రీల్స్ సంస్థ ఈరోస్ సంస్థకి రూ.11 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై రెండు సంస్థలు పలుమార్లు కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మద్రాస్ హైకోర్టు 14 రీల్స్ సంస్థ ఈరోస్ సంస్థకి రూ.11 కోట్లు కట్టాలని చెప్పింది. ఆ తరువాత కూడా వాదనలు జరిగాయి.
ఇక 2019లో చెన్నై హైకోర్టు మరోసారి స్పష్టమైన తీర్పును ఇచ్చింది. 14 రీల్స్ సంస్థ ఈరోస్ కి రూ.11 కోట్లకు వడ్డీతో కలిసి మొత్తం రూ.27 కోట్లు చెల్లించాలని చెప్పింది. ఆ తరువాత మళ్ళీ వాదనలు వినిపించింది 14 రీల్స్ సంస్థ. ఆ కేసు తేవలకపోవడంతో 14 రీల్స్ సంస్థ నుంచి బయటకు వచ్చిన నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట 14 రీల్స్ ప్లస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇప్పుడు అదే సంస్థలో అఖండ 2 సినిమాను తెరకెక్కించారు. కాబట్టి, 14 రీల్స్ కి 14 రీల్స్ ప్లస్ సంస్థకి ఎలాంటి సబందం లేదని, ఆ సంస్థకు సంబందించిన ఆర్థిక లావాదేవీలను 14 రీల్స్ ప్లస్ చెల్లించాల్సిన అవసరం లేదని 14 రీల్స్ ప్లస్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఒకవేళ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటే బయ్యర్లు, థియేటర్ యాజమాన్యం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అని కూడా తెలిపారు.
మళ్ళీ దీనిపై పిటీషన్ వేసిన ఈరోస్ సంస్థ 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ రెండు సంస్థలు ఒకటే అనే వాదనలు వినిపించాయి. కానీ, కోర్టు మాత్రం దానికి అంగీకరించలేదు. ఈమేరకు అక్టోబర్ 30న స్పష్టమైన తీరును ఇచ్చింది. అదేంటంటే, 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ కి ఎలాంటి సంబందం లేదు. దానికి సంబందించిన లావాదేవీలను ఈ సంస్థ తీర్చాలని పని లేదు. కాబట్టి, అఖండ 2 సినిమాను ఎలాంటి అభ్యంతరం లేకుండా రిలీజ్ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది కోర్టు. దీంతో అఖండ 2 రిలీజ్ పనుల్లో పడిపోయారు మేకర్స్. అందులో భాగంగానే ప్రమోషన్స్, డిసెంబర్ 4న పైడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ, అనూహ్యంగా డిసెంబర్ 3న చెన్నై కోర్టులో పీటీషన్ వేసింది. దీంతో, చెన్నై కోర్టు అఖండ 2 సినిమాపై కేవలం స్టే మాత్రమే విధించింది. ఈ కేసును పునర్పరిశీలన చేయాలని, మళ్ళీ విచారణ చేపట్టాలని కోరింది. దాంతో, అఖండ 2 సినిమా వాయిదా పడాల్సి వచ్చింది.
