Kalki Bhairava Anthem : ‘కల్కి’ భైరవ యాంతం వీడియో సాంగ్ చూసారా? పంజాబీ స్టైల్‌లో..

తాజాగా కల్కి భైరవ యాంతం వీడియో విజువల్స్ తో సాంగ్ రిలీజ్ చేసారు.

Kalki Bhairava Anthem : ‘కల్కి’ భైరవ యాంతం వీడియో సాంగ్ చూసారా? పంజాబీ స్టైల్‌లో..

Prabhas Diljit Dosanjh Kalki 2898ad Bhairava Anthem Video Lyrical Song Released

Kalki Bhairava Anthem : ప్రభాస్ కల్కి 2898AD సినిమా కోసం అభిమానులు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్ తో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇలా స్టార్ నటీనటులు చాలా మంది ఈ సినిమాలో నటిస్తుండగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

కల్కి సినిమా జూన్ 27 రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. ఓ పక్క కల్కి వెహికల్ ని దేశంలోని ప్రముఖ నగరాలూ తిప్పుతున్నారు. మరో పక్క సినిమా నుంచి కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, ట్రైలర్ రిలీజ్ చేయగా నిన్న కల్కి సినిమా నుంచి భైరవ యాంతం అంటూ పంజాబీ స్టైల్ లో ఉండే ఓ పాటని విడుదల చేసారు. అయితే నిన్న కేవలం ఆడియో సాంగ్ మాత్రమే రిలీజ్ చేయగా తాజాగా కల్కి భైరవ యాంతం వీడియో విజువల్స్ తో సాంగ్ రిలీజ్ చేసారు.

Also Read : NTR Childrens : ఫ్యామిలీతో దేవర షూటింగ్‌కి ఎన్టీఆర్.. ఎన్టీఆర్ పిల్లల్ని చూశారా..? అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు..

సంతోష్ నారాయణ్ సంగీత దర్శకత్వంలో పంజాబీ సింగర్ దిల్జీత్ దోసంజ్ తో ఈ పాటను పాడించారు. ఈ వీడియోలో దిల్జీత్ దోసంజ్ తో పాటు ప్రభాస్ కూడా స్టైలిష్ గా కనిపించి అలరించాడు. ప్రస్తుతం ప్రభాస్ విజువల్స్ తో వచ్చిన ఈ భైరవ యాంతం వైరల్ గా మారింది.