పర్సనల్ ట్రైనర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్ గిఫ్ట్!..

Prabhas gifted Range Rover: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి అంటూ ఇండస్ట్రీలో చాలామంది చెప్తుంటారు. డార్లింగ్ ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
అలాగే తన దగ్గర పనిచేస్తున్నవారికి, స్నేహితులకు ఖరీదైన బహుమతులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా తన ఫిట్‌నెస్ ట్రైనర్‌కు ప్రభాస్ ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు.
ప్రభాస్ వద్ద చాలాకాలంగా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్‌కు ప్రభాస్ లక్షల రూపాయలు విలువ చేసే రేంజ్‌రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. దీంతో లక్ష్మణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కార్ వద్ద లక్ష్మణ్ కుటుంబంతో కలిసి ప్రభాస్ దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు.