Prabhas Look : ‘కల్కి’ కోసం ముంబైలో దిగిన ప్రభాస్.. లుక్ అదిరిందిగా..

'కల్కి' కోసం ప్రభాస్ ముంబై తరలి వెళ్ళాడు.

Prabhas in Mumbai for Kalki Movie Promotions Videos goes Viral

Prabhas Look : ప్రభాస్ కల్కి సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27న ఈ భారీ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, గ్లింప్స్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ నెమ్మదిగా చేస్తున్నారు. ఓ పక్క సెన్సార్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం.

Also Read : Director Teja : ‘పోలీస్ వారి హెచ్చరిక’ అంటున్న డైరెక్టర్ తేజ..

కల్కి సినిమా ప్రమోషన్స్ బాలీవుడ్ లో ప్లాన్ చేసారు. దీంతో ముంబైలో భారీగా కల్కి ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయ్యారు మూవీ టీమ్. దీనికోసం ప్రభాస్ ముంబై తరలి వెళ్ళాడు. నిన్న రాత్రి ప్రభాస్ ముంబై వెళ్ళాడు. ముంబైలో ప్రభాస్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ సరికొత్త లుక్ చూసి ఏమున్నాడ్రా బాబు, కటౌట్ అదిరిందిగా అని అంటున్నారు ఫ్యాన్స్. ఇవాళ ముంబైలో జరగబోయే కల్కి ప్రమోషనల్ ఈవెంట్లో ప్రభాస్ పాల్గొననున్నాడు.

కల్కి బుజ్జి ఈవెంట్ తర్వాత మళ్ళీ ఇలా బయట కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్కి ప్రమోషన్స్ బాగా చేయాలని, ప్రభాస్ ఎక్కువగా బయట కనపడాలని భావిస్తున్నారు అభిమానులు.