Director Teja : ‘పోలీస్ వారి హెచ్చరిక’ అంటున్న డైరెక్టర్ తేజ..

పోలీస్ వారి హెచ్చరిక లోగో లాంచింగ్ అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ..

Director Teja : ‘పోలీస్ వారి హెచ్చరిక’ అంటున్న డైరెక్టర్ తేజ..

Director Teja Launched Police Vari Hechharika Movie Title Logo

Updated On : June 19, 2024 / 8:59 AM IST

Director Teja : దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై బెల్లి జనార్థన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిడ్డేశ్, శుభలేఖ సుధాకర్, షియాజీ షిండే, హిమజ, జయవాహినీ, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Srikanth : శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మహిష’ ఫస్ట్ లుక్ రిలీజ్..

పోలీస్ వారి హెచ్చరిక లోగో లాంచింగ్ అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. ఏ సినిమాకు అయినా ప్రేక్షకులను ఆకర్షించేది, వారిని థియేటర్ల వద్దకు రప్పించేది టైటిల్ మాత్రమే. ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటి శక్తివంతమైన మాస్ టైటిల్. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయం తీసుకురావాలని అన్నారు. నిర్మాత బెల్లి జనార్దన్ మాట్లాడుతూ.. సక్సెస్ ఫుల్ దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పబ్లిసిటీ ప్రారంభించడం మాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని తెలిపారు.

దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్ లలో పూర్తి చేసాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు.