Prabhas : ఫోటో ఇస్తారు లేదా కలుస్తారు.. ఈయనేంటి.. ప్రభాస్ తన ఫ్యాన్ ని హీరోని చేస్తున్నాడా?

తనతో పనిచేసే కాస్ట్ అండ్‌ క్రూనే కాదు ఫ్యాన్స్‌ను కూడా బాగా చూసుకుంటాడు ప్రభాస్.

Prabhas Introducing his Fan as Hero in Film Industry Rumors goes Viral

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు. బాహుబలి.. బాహుబలి 2 సినిమాలతో పాన ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్ ఇటీవల సలార్, కల్కి.. పాన్ ఇండియా మూవీస్‌తో తన ఫ్యాన్‌ బేస్‌ను పెంచుకుంటూ పోతున్నాడు డార్లింగ్. అయితే అభిమానులు అంటే ప్రాణంగా చూసుకునే ప్రభాస్‌ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ హీరో చేయని ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. తన హార్డ్‌ కోర్ ఫ్యాన్‌ అయిన ఓ యువకుడ్ని హీరోను చేయబోతున్నాడట.

ప్రభాస్‌ ఏది చేసినా సమ్‌థింగ్‌ స్పెషలే. ఏ పని అయినా, సహాయం అయినా అందరూ చెప్పుకోవాల్సిందే. తనతో ఏ స్టార్స్ నటించినా, ఎంత మంది ఉన్నా వాళ్ళందరికీ రకరకాల పుడ్ ఐటమ్స్ తన ఇంట్లో చేయించి మరీ పెడతాడు. అంతేకాదు సినిమా అయ్యాక మొత్తం యూనిట్‌కు గిప్ట్స్ ఇస్తాడు. అందుకే ప్రభాస్‌తో పనిచేసే అందరూ మరోసారి డార్లింగ్‌తో కలసి వర్క్ చేయాలనుకుంటారు.

Also Read : Saregamapa : సరిగమప సీజన్ 16 టైటిల్ ఎవరు విన్ అవుతారు? 10 లక్షలు ఎవరు గెలుస్తారు?

తనతో పనిచేసే కాస్ట్ అండ్‌ క్రూనే కాదు ఫ్యాన్స్‌ను కూడా బాగా చూసుకుంటాడు ప్రభాస్. అందుకే ఫ్యాన్స్ కోసం ప్రభాస్.. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు తన ఫ్యాన్‌ను హీరో చేస్తున్నాడట. తన హార్డ్ కోర్‌ ఫ్యాన్ అయిన సాయి అనే యువకుడ్ని హీరోగా అరంగేట్రం చేయిస్తున్నాడట ప్రభాస్. ఇప్పుడీ న్యూస్‌ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

Also Read : Thiruveer : అరకులో తీవ్ర చలిలో షూటింగ్.. ఈ సినిమా కోసం ఫోటోలు తీయడం నేర్చుకొని..

త్వరలోనే మూవీ ఓపెనింగ్ కార్యక్రమం జరగబోతుందని దానికి ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడని అంటున్నారు. ఫ్యాన్ అయితే ఓ ఫోటో ఇవ్వడమో, కలవడంలో, భోజనం పెట్టడమో లేక గిఫ్టో లేక సాయం చేయడం ఓకే. ఏకంగా అభిమానిని హీరోని చేయటం డార్లింగ్‌కే చెల్లిందంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ కి యువీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో భాగం ఉన్న సంగతి తెలిసిందే. ఆ నిర్మాణ సంస్థలోనే తన ఫ్రెండ్ డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ కి కూడా హీరోగా వరుస సినిమాలు ఇచ్చాడు. మరి ఈ ఫ్యాన్ ని హీరో చేస్తున్నాడు అనేది రియలా లేక వైరల్ న్యూస్‌ అనేది వేచి చూడాలి మరి. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో ఉన్నాడు. వీటి తర్వాత మరో నాలుగు పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెట్టాడు.