Thiruveer : అరకులో తీవ్ర చలిలో షూటింగ్.. ఈ సినిమా కోసం ఫోటోలు తీయడం నేర్చుకొని..
ప్రస్తుతం తిరువీర్ 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

Thiruveer Learning Camera For his New Movie Shooting Happened in Araku
Thiruveer : స్టేజ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి జార్జ్ రెడ్డి సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్. ఆ తర్వాత పలాస 1978, టక్ జగదీశ్ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. అనంతరం మసూద, పరేషన్.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హీరోగా హిట్స్ కొట్టాడు. మసూద అయితే భారీ విజయం సాధించింది. దీంతో తిరువీర్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.
ప్రస్తుతం తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది. తాజాగా తిరువీర్ తన కొత్త సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు.
తిరువీర్ మాట్లాడుతూ.. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్ర పోషించడం కొత్తగా ఉంది. మొబైల్‌తో చాలాసార్లు ఫోటోలు తీశాను కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం ఛాలెంజింగ్‌గా ఉంది. స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎలా పట్టుకోవాలి, కెమెరా గురించి, ఫోటోగ్రఫీ గురించి.. ఇలా చాలా విషయాల్ని ఈ సినిమా కోసం నేర్చుకున్నాను. ఇటీవల ఈ మూవీ షూటింగ్ అరకులో జరిగింది. అక్కడి తీవ్ర చలిని తట్టుకుని మరి టీం అంతా కష్టపడి సినిమా షూట్ చేసాము అని తెలిపారు.
Also See : సిద్దార్థ్ కొత్త సినిమా టైటిల్ టీజర్ చూశారా? ఎంత బాగుందో..
ఇక తిరువీర్ ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమా తర్వాత భగవంతుడు, మోక్షపటం అనే సినిమాలు చేస్తున్నాడు. అవి కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. అవి కాకుండా మరో రెండు సినిమాలు తిరువీర్ చేతిలో ఉన్నాయి. మసూద తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాల్ని ఎంచుకుంటున్నాడు. తనకు సరిపోయే కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కొన్ని నెలల క్రితమే తిరువీర్ పెళ్లి కూడా చేసుకున్నాడు.