Saregamapa : సరిగమప సీజన్ 16 టైటిల్ ఎవరు విన్ అవుతారు? 10 లక్షలు ఎవరు గెలుస్తారు?
జీ తెలుగులో సింగింగ్ ప్రోగ్రాం సరిగమప సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 16 సాగుతుండగా ఈ ప్రోగ్రాం ఫైనల్ కు చేరుకుంది.

ZEE Saregamapa Season 16 The Next Singing Youth Icon Title Final Race
Saregamapa : జీ తెలుగులో సింగింగ్ ప్రోగ్రాం సరిగమప సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 16 సాగుతుండగా ఈ ప్రోగ్రాం ఫైనల్ కు చేరుకుంది. ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. ఈ సీజన్ కు శ్రీముఖి హోస్ట్ చేయగా సంగీత దర్శకుడు కోటి, గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ సీజన్లో ఎంపికైన గాయనీ గాయకులు విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్, మెట్రో మెలోడీస్ మూడు జట్లుగా పోటీపడ్డారు. ఈ జట్లకు సింగర్స్ రేవంత్, రమ్య బెహర, అనుదీప్ దేవ్ మెంటర్లుగా వ్యవహరించారు. సోలో, డ్యూయెట్, గ్రూప్.. ఇలా పలు రౌండ్స్ ని దాటి ఫైనల్ గా ఆరుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. మొదట్నుంచి అద్భుతమైన ప్రదర్శనతో రాణిస్తున్న సాత్విక్, మేఘన, వైష్ణవి, మోహన్, అభిజ్ఞ, మానసలు ఫినాలేకు చేరుకుని టైటిల్ బరిలో నిలిచారు. ఈ ఆరుగురు సరిగమప 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ టైటిల్ కోసం పోటీపడనున్నారు.
Also See : సిద్దార్థ్ కొత్త సినిమా టైటిల్ టీజర్ చూశారా? ఎంత బాగుందో..
అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు తండేల్ మూవీ యూనిట్ నుంచి హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీనియర్ నటి రాధ, హీరో విశ్వక్ సేన్ కూడా ఈ ఫినాలేకు హాజరయ్యారు. అలాగే గాయని మంగ్లీ ఫైనల్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నిసర్గ గౌడ, ప్రీతి శర్మ, అభినవ్, సంగీత, పృథ్వీ, సాయికిరణ్.. పలువురు సీరియల్ నటీనటులు కూడా ఫైనల్ ఎపిసోడ్ కి హాజరయ్యారు. దీనికి సంబంధించిన చిన్న ప్రోమోని కూడా రిలిజ్ చేసారు.
ఈ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులు పలు మ్యూజికల్ రౌండ్లలో పోటీపడనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో గెలిచిన కంటెస్టెంట్ సరిగమప 16 ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ టైటిల్ తో పాటు పది లక్షల నగదుని కూడా గెలుచుకోనున్నారు. మరి ఆరుగురిలో ఎవరు టైటిల్ విన్ అవుతారు? పదిలక్షలు గెలుచుకుంటారో తెలియాలంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో చూసేయాల్సిందే.