Kalki Review : ‘కల్కి’ సెన్సార్ రివ్యూ.. ఏకంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన బాలీవుడ్.. ప్రభాస్ కామెడీతో పాటు..

తాజాగా ఓ బాలీవుడ్ మీడియా కల్కి సెన్సార్ రివ్యూని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Kalki Review : ‘కల్కి’ సెన్సార్ రివ్యూ.. ఏకంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన బాలీవుడ్.. ప్రభాస్ కామెడీతో పాటు..

Prabhas Kalki 2898AD Movie Bollywood Censor Review Standing Ovation by Censor Member

Updated On : June 19, 2024 / 10:00 AM IST

Kalki Review : ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, గ్లింప్స్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా కల్కి మూవీ సెన్సార్ పూర్తయింది. ముంబైలో కల్కి సినిమా సెన్సార్ పూర్తిచేసుకోగా సెన్సార్ రివ్యూ బయటకు వచ్చింది.

తాజాగా ఓ బాలీవుడ్ మీడియా కల్కి సెన్సార్ రివ్యూని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సెన్సార్ వాళ్ళు చెప్పిన రివ్యూ ప్రకారం.. కల్కి సినిమాలో అదిరిపోయే విజువల్స్ ఉన్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయని, సినిమా అంతా అయ్యాక స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని తెలిపారు. అలాగే అలాంటి విజువల్స్ అసలు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో చూడలేదని, చాలా కొత్తగా సినిమా ఉండబోతుంది అని, కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని తెలిపారు. అలాగే ప్రభాస్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా అదరగొట్టాడని, అమితాబ్, కమల్ హాసన్ తో పాటు మిగిలిన వాళ్లంతా కూడా చాలా బాగా నటించారని అన్నారు. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంకొంచెం మెరుగుపరిస్తే బాగుండేదని చెప్పారు. అలాగే సినిమాలో చాలా మంది సౌత్ ఇండియా స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినట్టు, క్లైమాక్స్ అదిరిపోతుంది తెలిపారు.

Also Read : Prabhas Look : ‘కల్కి’ కోసం ముంబైలో దిగిన ప్రభాస్.. లుక్ అదిరిందిగా..

ఇక కల్కి సినిమా 2 గంటల 55 నిమిషాల నిడివి ఉంటుందని, U/A వస్తుందని ముంబై సెన్సార్ ఆఫీస్ సమాచారం. దీంతో ఈ కల్కి సినిమా రివ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది. బాలీవుడ్ సెన్సార్ వాళ్ళు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు.