Prabhas Kalki : మహేష్ ఇలాకాలో ప్రభాస్ రికార్డ్.. హైదరాబాద్‌లో ఆ మూడు చోట్ల ప్రభాస్ ‘కల్కి’ సరికొత్త రికార్డ్..

తాజాగా కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాయి.

Prabhas Kalki : మహేష్ ఇలాకాలో ప్రభాస్ రికార్డ్.. హైదరాబాద్‌లో ఆ మూడు చోట్ల ప్రభాస్ ‘కల్కి’ సరికొత్త రికార్డ్..

Prabhas Kalki 2898AD Movie Creates New Record in Mahesh Babu AMB Cinemas and another 2 Multiplex Theaters

Updated On : July 4, 2024 / 7:17 AM IST

Prabhas Kalki : ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక కలక్షన్స్ లో కూడా అదరగొడుతుంది. ఇప్పటికే కల్కి సినిమా 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేకచోట్ల పలు రికార్డులు బద్దలుకొట్టింది. ఇక స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే హైదరాబాద్ లో హంగామా మాములుగా ఉండదు. సింగిల్ స్క్రీన్స్ నుండి మల్టిప్లెక్స్ ల వరకు అన్ని థియేటర్స్ కళకళలాడతాయి. వీకెండ్ మూడు రోజులు హౌస్ ఫుల్ ఉంటాయి. తాజాగా కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాయి.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ మైక్ ఎందుకు అలా పట్టుకుంటాడు? చిన్న పాప రీల్‌కి రిప్లై ఇచ్చిన విజయ్..

హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ 7 స్క్రీన్స్ ఉన్నాయి. రిలీజ్ రోజు అన్ని స్క్రీన్స్ లో కలిపి ఆల్మోస్ట్ 40 షోల వరకు వేసినట్టు తెలుస్తుంది. అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. అంతే కాకుండా AMBలో ఒక కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. మహేష్ థియేటర్లో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్ గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదు. దీంతో మహేష్ ఇలాకాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అని అంటున్నారు అభిమానులు. AMB సినిమాస్ స్వయంగా ఈ రికార్డ్ ని పోస్ట్ చేయడం గమనార్హం.

View this post on Instagram

A post shared by AMB Cinemas (@amb_cinemas)

అలాగే హైదరాబాద్ నల్లగండ్లలో ఇటీవలే అపర్ణ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. ఇక్కడ కూడా కల్కి రిలీజ్ రోజు మొత్తం 42 షోలు వేశారు. అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక్కడ ఫస్ట్ టైం కోటి రూపాయల గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. అయిదు రోజుల్లో కోటి పదిలక్షలు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది కల్కి సినిమా.

ఇక హైదరాబాద్ లో అందరూ మెచ్చే, అన్నిటికంటే ఓల్డ్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రసాద్స్ ఐమాక్స్. శుక్రవారం వచ్చిందంటే పొద్దున్నుంచి ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద భారీగా జనాలు ఉంటారు. అనేకమంది సినిమా సెలబ్రిటీలు కూడా సినిమాలు ఇక్కడే చూస్తారు. కల్కి సినిమా రిలీజ్ రోజు ఇక్కడ 36 షోలు వేయగా అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక్కడ కూడా ఇరవై ఏళ్ళల్లో చాలా ఫాస్ట్ గా ఒక కోటి గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో తమ కల్కి సినిమాతో అనేక రికార్డులు సెట్ చేస్తున్నాము అంటూ ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.