Prabhas: రెబల్ స్టార్ లేటెస్ట్ లుక్స్.. ఫ్యాన్స్ కి పండగే..

సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావడం, అందులోను డార్లింగ్ ప్రభాస్(Prabhas) హీరో అవడంతో స్పిరిట్ పై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి.

Prabhas: రెబల్ స్టార్ లేటెస్ట్ లుక్స్.. ఫ్యాన్స్ కి పండగే..

Prabhas latest looks trending on social media.

Updated On : December 12, 2025 / 4:08 PM IST

Prabhas; పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు భారీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. వాటిలో ముందు విడుదల కానున్న సినిమా రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్(Prabhas) నుంచి వస్తున్న సినిమాలు ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2. కానీ, వీటిలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా అంటే స్పిరిట్ అనే చెప్పాలి.

Komatireddy Venkat Reddy: సినిమా టికెట్ ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

దానికి కారణం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుంది సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత ఆయన చేస్తున్న సినిమా కావడం, అందులోను డార్లింగ్ ప్రభాస్ హీరోగా అవడంతో ఈ ప్రాజెక్టు పై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక అప్పటినుంచి ప్రభాస్ ఎక్కడ కనిపించినా అది స్పిరిట్ లుక్ అంటూ సోషల్ మీడియాలో టట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్, ప్రభాస్ ఫ్యాన్స్. ఇక తాజాగా ప్రభాస్ కి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అవి కూడా స్పిరిట్ సినిమాలోవే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Prabhas latest looks trending on social media. (1)