టికెట్ రేట్లు పెంచమని అడగొద్దు.. మేం ఇవ్వం.. కుండబద్దలు కొట్టిన కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రలో సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి సినిమా టికెట్ల ధరలను పెంచే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.

టికెట్ రేట్లు పెంచమని అడగొద్దు.. మేం ఇవ్వం.. కుండబద్దలు కొట్టిన కోమటిరెడ్డి

Minister Komatireddy shocking comments on movie ticket prices hike issue

Updated On : December 12, 2025 / 4:30 PM IST

Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్రలో సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి సినిమా టికెట్ల ధరలను పెంచే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. సినిమా నిర్మాతలు, దర్శకులు తమ వద్దకు టికెట్‌ ధరలు పెంచమని తమ వద్దకు రావొద్దని చెప్పారు. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్‌ ఎవరు ఇవ్వమన్నారని ఈ సందర్బంగా ఆయన ప్రశ్నించారు. తక్కువ ధరలు ఉన్నప్పుడే ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి సినిమా చూస్తారని, ఆ విధానమే మంచిదని సూచించారు. అందుకే, తెలంగాణలో ఇకనుంచి రేట్లను పెంచే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి.

Kaantha OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ మూవీ ‘కాంత’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తాజాగా, అఖండ 2 సినిమా రిలీజ్ సందర్బంగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ముందు తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 టికెట్స్ ధరలు పెంచుకునేందుకు అవకాశాన్ని కలిపిస్తూ జీవో జారీ చేసింది. దానిని వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు సర్కార్ ఇచ్చిన జీవోను కొట్టివేసింది. తాజాగా మరోసారి ఈ విషయంపై వాదనలు జరుగంగా నిర్మాతలకు ఫేవర్ గా తీర్పు ఇచ్చింది. అయితే, ప్రతీసారి ఇదే సీన్ రిపీట్ అవుతుండటంతో మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.