Kaantha OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ మూవీ ‘కాంత’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

దుల్కర్ సల్మాన్ కాంత మూవీ ఓటీటీ(Kaantha OTT)లో విడుదల అయ్యింది. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Kaantha OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ మూవీ ‘కాంత’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dulquer Salmaan Kaantha movie now streaming on OTT

Updated On : December 12, 2025 / 2:58 PM IST

Kaantha OTT: ఇండియాలో ఉన్న అసలైన పాన్ ఇండియా స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ సల్మాన్ అనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసి హిట్స్ కొట్టడం ఈ హీరో అలవాటు. తాజాగా దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కాంత. లేటెస్ట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రానా, సముద్రఖని కీ రోల్స్ చేశారు. పీరియాడికల్ క్రైం థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సెల్వమని, సెల్వరాజ్ తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా నవంబర్ 14న విడుదల అయ్యింది.

Akhanda 2: అఖండ 2 మేకర్స్ కి హైకోర్టులో ఊరట.. టికెట్ రేట్ల జీవో రద్దు ఉత్తర్వులు సస్పెండ్

అయితే, ఆడియన్స్ నుంచి మాత్రం ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. తీసుకున్న బ్యాక్డ్రాప్ బాగానే ఉన్నప్పటికీ.. కథ, కథన పేలవంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో కాంత(Kaantha OTT) సినిమాను ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే డిసెంబర్ 12 నుంచి కాంత సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. దీంతో, ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక థియేటర్స్ లో ఈ సినిమాకు గొప్ప ఆదరణ రాలేదు కాబట్టి.. ఓటీటీలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.