Akhanda 2: అఖండ 2 మేకర్స్ కి హైకోర్టులో ఊరట.. టికెట్ రేట్ల జీవో రద్దు ఉత్తర్వులు సస్పెండ్
అఖండ 2(Akhanda 2) మేకర్స్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపు జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
Telangana High Court suspends orders to cancel Akhanda 2 ticket price hike
Akhanda 2; అఖండ 2 మేకర్స్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా టికెట్ రేట్ల పెంపుకు సంబందించిన జీవో రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. తెలంగాణకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి అఖండ 2 టికెట్ రేట్ల పంపును వ్యతిరేకిస్తూ హైకోర్టు లో లంచ్ మోషన్ పాస్ చేసిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. టికెట్ రేట్స్, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇస్తూ జరీ చేసిన జీవోను కొట్టివేసింది. దీనిపై మళ్ళీ వాదనలు జరుగగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో, తెలంగాణలో అఖండ 2(Akhanda 2) సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అవకాశం లభించింది. దీంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Akhanda 2 Review; అఖండ 2 రివ్యూ: బాలయ్య తాండవం ఎలా ఉంది.. సినిమా హిట్టా? ఫట్టా?
