Prabhas: పండగకే టెండర్ పెట్టిన ప్రభాస్.. నిజమేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత కూడా ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులను ఓకే....

Prabhas: పండగకే టెండర్ పెట్టిన ప్రభాస్.. నిజమేనా?

Prabhas Maruthi Movie To Start From This Time

Updated On : May 31, 2022 / 9:17 PM IST

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత కూడా ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేశాడు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమాకు ఓకే చేశాడు. అంతేగాక, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాను కూడా రెడీ చేశాడు. అయితే ఈ సినిమాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ ఆసక్తిగా ఉన్నాడు.

Prabhas: మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్స్.. ప్రభాస్ కోసం అనుష్క?

అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను హార్రర్ మూవీగా తెరకెక్కించేందుకు దర్శకుడు మారుతి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను దసరా సందర్భంగా లాంఛ్ చేసి, రెండు షెడ్యూల్స్‌లో మాత్రమే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

Prabhas: బ్రేక్‌లోనే కానిచ్చేస్తానంటోన్న ప్రభాస్!

ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని చూస్తోందట. మరి నిజంగానే ఈ సినిమాను దసరా సందర్భంగా లాంఛ్ చేసి, అనుకున్నట్లుగానే త్వరగా పూర్తి చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.