Prabhas : ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా కన్ఫర్మ్.. సలార్ తర్వాత ప్రభాస్ లైనప్ ఇదే..

గత కొంతకాలంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

Prabhas : ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా కన్ఫర్మ్.. సలార్ తర్వాత ప్రభాస్ లైనప్ ఇదే..

Prabhas Movie Confirm with Director Hanu Raghavapudi with a War Love Story

Updated On : January 20, 2024 / 3:14 PM IST

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్(Salaar) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ విజయం సాధించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ లైనప్ చాలా పెద్దగానే ఉంది.

ఇప్పుడు సలార్ తర్వాత సమ్మర్ లో మే 9న కల్కి 2898AD సినిమాతో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హాలీవుడ్ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా రాబోతుంది. ఇది లవ్, కామెడీ, హారర్ కథాంశంతో ఉండబోతుందని సమాచారం. రాజాసాబ్ సినిమా ఈ సంవత్సరం చివర్లో రావొచ్చు.

అనంతరం సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే పోలీస్ యాక్షన్ డ్రామా ఉండబోతుంది. సందీప్ త్వరలో ఈ సినిమా వర్క్ మొదలుపెడతానని ఇటీవలే చెప్పాడు. ఆ తర్వాత ఇటీవల హిట్ అయిన సలార్ సినిమాకు సీక్వెల్ సలార్ 2 ఉండనుంది. బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లో హను రాఘవపూడి సినిమా చేరింది.

గత కొంతకాలంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. హను రాఘవపూడి సీతారామం సినిమాకు పనిచేసిన విశాల్ చంద్రశేఖర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాకు కూడా చేయబోతున్నాను అని తెలిపాడు. దీంతో ఈ సినిమా కూడా ఫిక్స్ అని తెలుస్తుంది.

Also Read : Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ కోసం 13 సెట్లు.. విశ్వం అంతా కనపడేలా..

హను రాఘవపూడి అంటే క్లాస్ సినిమాలు తీస్తాడని పేరు ఉంది. సీతారామం సినిమాతో అందర్నీ మెప్పించాడు హను రాఘవపూడి. ప్రభాస్ తో వరల్డ్ వార్ 2 నేపథ్యంలో ప్రేమకథతో సినిమా తీస్తాడని సమాచారం. హనుతో ప్రభాస్ సినిమా కన్ఫర్మ్ అని తెలియడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. వరుసగా మాస్ సినిమాల మధ్యలో ఓ ప్రేమకథలో ప్రభాస్ ని చూడొచ్చు అని భావిస్తున్నారు.