Prabhas : ఇదెక్కడి మాస్ రా బాబు.. ఆ దేశంలో ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు.. అదిరింది డార్లింగ్ అంటున్న ఫ్యాన్స్..

ఓ దేశంలో ఏకంగా ప్రభాస్ అనే పేరుతో ఓ ఊరు ఉంది.

Prabhas Named Village in that Country Village Name Board goes Viral Fans Surprised

Prabhas : బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అన్ని భారీ సినిమాలు తీస్తూ పాన్ ఇండియా వైడ్ మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇటీవల కల్కి సినిమాతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు వరుసగా అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది.

సాధారణంగా వీధుల పేర్లు, ఊర్ల పేర్లు ఏ రాజకీయ నాయకులవో, సెలబ్రిటీలవో ఉంటాయి. అయితే ఓ దేశంలో ఏకంగా ప్రభాస్ అనే పేరుతో ఓ ఊరు ఉంది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా.. మన దేశానికి ఆనుకొని ఉన్న దేశం నేపాల్ లో ఈ ప్రభాస్ అనే ఊరు ఉంది. ఇటీవల ఓ తెలుగు మోటో బ్లాగర్ నేపాల్ కి వెళ్లగా అతను ప్రయాణిస్తుండగా దారిలో ప్రభాస్ అనే పేరుతో ఓ ఊరు కనిపించింది. దీంతో అతను ఆశ్చర్యపోయి ఆ ప్రభాస్ అని రాసి ఉన్న ఆ ఊరి పేరు బోర్డుని వీడియో తీసాడు. దీంతో ఈ వీడియోని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరే ఉంది, అది కూడా వేరే దేశంలో అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్.

Also Read : Roja – Srikanth : రోజా రీ ఎంట్రీ.. సరదా కౌంటర్ ఇచ్చిన శ్రీకాంత్.. ‘సంక్రాంతి వస్తున్నాం’ సీన్ రీ క్రియేట్.. ప్రోమో వైరల్..

అయితే ఈ పేరు ఎప్పట్నుంచో ఉందని తెలుస్తుంది. కానీ ఆ ఊరికి ప్రభాస్ అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది మాత్రం తెలియదు. మరి ఈసారి నేపాల్ కి ఎవరైనా వెళ్తే ఈ ఊరు గురించి, ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకుంటారేమో చూడాలి.

ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2, హోంబలే సంస్థలో మరో రెండు సినిమాలతో భారీ లైనప్ పెట్టుకున్నారు. సమ్మర్ కి రానున్న రాజాసాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచుస్తున్నారు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ అత్త – మామ 40వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్.. క్లిన్ కారాతో చరణ్ అదుర్స్..