Salaar Collections : సలార్ మూడో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

సలార్ మూడో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..? ఈ కలెక్షన్స్ దూకుడు చూస్తుంటే..

Salaar Collections : సలార్ మూడో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

Prabhas Prashanth Neel Salaar Part 1 third day Collections report

Updated On : December 25, 2023 / 2:12 PM IST

Salaar Collections : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలతో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఈ శుక్రవారం భారీ అంచనాలు మధ్య పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మొదటిరోజే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.178 కోట్లకు పై గ్రాస్‌ని ఈ ఇయర్ టాప్ ఓపెనర్ గా నిలిచింది.

ఇక రెండో రోజు దాదాపు 117 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి.. రెండు రోజుల్లో దాదాపు 295 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. తాజాగా మూడో రోజు ఆదివారం వచ్చిన కలెక్షన్స్ ని కూడా నిర్మాతలు తెలియజేశారు. మూడో రోజు కూడా ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. థర్డ్ డే 107 పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి.. మొత్తం మూడురోజుల్లో 402 కోట్ల గ్రాస్ ని సెట్ చేసింది.

Also read : Salaar : సలార్ మేకింగ్ వీడియో చూశారా..? అవి అన్ని గ్రాఫిక్స్ కాదా..!

దీని బట్టి చూస్తే.. షేర్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 200 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఈరోజు కూడా క్రిస్మస్ హాలిడే ఉండడంతో.. ఈ చిత్రం ఈరోజు కూడా 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఖాయం అని తెలుస్తుంది.

కాగా ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్ సినిమాలు పఠాన్, జవాన్, యానిమల్ భారీ కలెక్షన్స్ ని నమోదు చేశాయి. కానీ ఇప్పుడు సలార్ కలెక్షన్స్ రోజు చూస్తుంటే.. ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు అతి కష్టం మీద 1000 కోట్ల మార్క్ వరకు చేరుకొని ఈ ఏడాది ఇండియన్ టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి. కానీ సలార్ మూడు రోజుల్లోనే 400 కోట్ల మార్క్ ని అందుకొని బాలీవుడ్ హీరోలకు టెన్షన్ పెడుతుంది.