Salaar : ప్రభాస్ ఫ్యాన్స్‌ని మళ్ళీ నిరాశపరిచిన సలార్ మేకర్స్.. సక్సెస్ పార్టీని కూడా..
ప్రభాస్ ఫ్యాన్స్‌ని మళ్ళీ నిరాశపరిచిన సలార్ మేకర్స్. సక్సెస్ పార్టీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే..

Prabhas Prithviraj Sukumaran at Salaar Part 1 Cease Fire Success party
Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా రూపొందించిన చిత్రం ‘సలార్’. ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ.670 కోట్ల వరకు గ్రాస్ అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరుని చూపిస్తుంది.
ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూవీ టీం.. చిన్న సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. సినిమాని బ్లాక్ థీమ్ లో ఆడియన్స్ కి చూపించిన వీరందరూ.. ఈ సక్సెస్ పార్టీలో కూడా బ్లాక్ డ్రెస్ లో కనిపించడం విశేషం. ప్రభాస్, పృథ్వీరాజ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సక్సెస్ ని చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసేసుకున్నారు.
కాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్మాతలు నిర్వహించలేదు. కనీసం ట్రైలర్, టీజర్ రిలీజ్ కి సంబంధించి కూడా ఒక్క ఈవెంట్ చేయలేదు. దీంతో అభిమానులంతా చాలా బాధ పడ్డారు. సినిమా సక్సెస్ అయిన తరువాత దానిని అయినా గ్రాండ్ గా చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు ఇలా సింపుల్ చేసేయడం అభిమానులను నిరాశపరుస్తుంది. ప్రస్తుతం నెట్టింట ఈ సక్సెస్ పార్టీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also read : Surekhavani : తిరుమల శ్రీవారికి తలనీలాలు అర్పించిన నటి.. గుండుతో సురేఖవాణి..
The blockbuster success calls for a BLOCKBUSTER CELEBRATION! ? #SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG #HombaleMusic @IamJagguBhai… pic.twitter.com/VtusBDbBgJ
— Salaar (@SalaarTheSaga) January 8, 2024
ఇక పాన్ ఇండియా వైడ్ ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది. లాటిన్ అమెరికాలో స్పానిష్ వెర్షన్ ని మార్చి 7న విడుదల చేయబోతున్నారు. ఆ తరువాత జపాన్ లో జాపనీస్ లాంగ్వేజ్ లో సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా జపాన్ లో ఆల్రెడీ తెలుగు లాంగ్వేజ్‌తో జపాన్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ అయ్యింది. ఈ రిలీజ్ లతో సలార్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం ఈ మూవీ రూ.670 కోట్ల వరకు గ్రాస్ అందుకున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 345 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ చిత్రం సుమారు 15 కోట్ల షేర్ ని అంటే 30 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది.