Radhe Shyam : ‘రాధే శ్యామ్’ నేషనల్ ఈవెంట్ హైలైట్స్

‘రాధే శ్యామ్ నేషనల్ ఈవెంట్ హైలెట్స్’ వీడియో చూశారా?..

Radhe Shyam : ‘రాధే శ్యామ్’ నేషనల్ ఈవెంట్ హైలైట్స్

Radhe Shyam Event

Updated On : January 17, 2022 / 11:19 AM IST

Radhe Shyam: రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను స్క్రీన్ మీద చూడ్డానికి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా ‘రాధే శ్యామ్’ సినిమా కోసం పనిచేస్తున్నాడు డార్లింగ్. ఎట్టకేలకు సినిమా రిలీజ్‌కి రెడీ అయిపోయింది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ‘రాధే శ్యామ్’ ప్రంపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

Manoj Manchu: మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్

డిసెంబర్ 23న రామోజీ ఫిలిం సిటీలో ‘రాధే శ్యామ్’ నేషనల్ ఈవెంట్ పేరుతో అంగరంగవైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తమ అభిమాన నటుణ్ణి చూడబోతుండడంతో భారీ సంఖ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్ఎఫ్‌సీకి చేరుకున్నారు. వారిని అదుపు చెయ్యడానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు కూడా.

AAGMC Movie : సుధీర్ బాబు సినిమాకి మైత్రీ మూవీస్ సపోర్ట్..

‘రాధే శ్యామ్’ నేషనల్ ఈవెంట్‌ను పాపులర్ ఈవెంట్ ఆర్గనైజింగ్ శ్రేయాస్ మీడియా భారీ స్థాయిలో తీర్చిదిద్దింది. స్టేజ్ దగ్గరి నుండి ఫంక్షన్‌కి సంబంధించిన అన్ని పనులను ఎంత కష్టపడి చేశారో తెలియజేస్తూ ‘రాధే శ్యామ్ నేషనల్ ఈవెంట్ హైలెట్స్’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది శ్రేయాస్ మీడియా.

Radhe Shyam : ఒకే గుండెకు రెండు చప్పుళ్లు.. దీంట్లో ఇంత మీనింగ్ ఉందా!?

ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్‌గా ఏర్పాటు చేసిన ‘రాధే శ్యామ్ నేషనల్ ఈవెంట్’ కోసం 24/7 దాదాపు ఐదు వందల మందికి పైగా పని చేశారు. స్టేజ్, ఛైర్స్, ఎల్ఈడీస్ వంటివి ఏర్పాటు చేశారు. శ్రేయాస్ మీడియా రిలీజ్ చేసిన ‘రాధే శ్యామ్ నేషనల్ ఈవెంట్ హైలెట్స్’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.