AAGMC Movie : సుధీర్ బాబు సినిమాకి మైత్రీ మూవీస్ సపోర్ట్..

సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యం..

AAGMC Movie : సుధీర్ బాబు సినిమాకి మైత్రీ మూవీస్ సపోర్ట్..

Aagmc

Updated On : December 29, 2021 / 12:05 PM IST

AAGMC Movie: సుధీర్ బాబు – విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత మరోసారి కలిసి సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు పక్కన ‘ఉప్పెన’ తో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’ తో అలరించిన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది..

Manoj Manchu: మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్

గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో, బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి కలిసి నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మార్క్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే అందమైన టైటిల్ ఫిక్స్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Shyam Singha Roy : ‘సిరివెన్నెల’ రాసిన చివరిపాట చూశారా..

ఈ సినిమా ఇప్పుడు మరింత భారీగా తెరకెక్కబోతోంది. ‘పుష్ప’ తో 2021లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా ఘనత దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.