Shyam Singha Roy : ‘సిరివెన్నెల’ రాసిన చివరిపాట చూశారా..
సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ లో ‘సిరివెన్నెల’, ‘ప్రణవాలయ’ అనే రెండు పాటలు రాశారు..

Sirivennela Video Song
Shyam Singha Roy: తన పాటలతో తెలుగు సినిమా స్థాయిని, సాహిత్య రంగంలో సినిమా పాట స్థానాన్ని పెంచిన అక్షరజ్ఞాని సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనిషి ఆలోచనలను, మెదడు ఆచరణను, ప్రేమను, బాధను వర్ణిస్తూ, వ్యక్తపరుస్తూ ఆయన రాసిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే.
Shyam Singha Roy : సత్తా చాటుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’..
ఇటీవల అకాల మరణం చెందిన సిరివెన్నెల చివరిసారిగా నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ లో ఆయన ‘సిరివెన్నెల’, ‘ప్రణవాలయ’ అనే రెండు పాటలు రాశారు. మంగళవారం ‘సిరివెన్నెల’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.
Shyam Singha Roy : థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది-ఆర్.నారాయణ మూర్తి
మిక్కీ జె మేయర్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. ‘నెలరాజుని, ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అంటూ సిరివెన్నెల అద్భుతమైన లిరిక్స్ రాశారు. పాట చూస్తున్నంత సేపు సిరివెన్నెల కళ్లముందు కదలాడుతున్నారంటూ సంగీత, సాహిత్య ప్రియులు భావోద్వేగానికి గురవుతున్నారు.