Rajasaab Collections : ప్రభాస్ రాజాసాబ్ మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?
ప్రీమియర్స్ సరిగ్గా ప్లాన్ చేయకపోవడంతో ఓపెనింగ్స్ ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టు రాలేదు.(Rajasaab Collections)
Rajasaab Collections
Rajasaab Collections : మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్ సినిమా ఇటీవల జనవరి 9న రిలీజయింది. థియేటర్స్ లో ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. రెండు రోజుల తర్వాత ఎడిటింగ్ లో తీసేసిన ప్రభాస్ ముసలి గెటప్ సీన్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసారు. అయితే ప్రీమియర్స్ సరిగ్గా ప్లాన్ చేయకపోవడంతో ఓపెనింగ్స్ ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టు రాలేదు.(Rajasaab Collections)
మొదటి రోజు, ప్రీమియర్స్ కలిపి రాజాసాబ్ సినిమా 112 కోట్లు గ్రాస్ వచ్చినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక రెండో రోజు మాత్రం దాదాపు 35 నుంచి 40 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టు సమాచారం. తాజాగా మూడో రోజు మూవీ యూనిట్ అధికారికంగా కలెక్షన్స్ ప్రకటించింది.
ప్రభాస్ రాజాసాబ్ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 183 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీయూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ కి ఇది తక్కువే. రాజాసాబ్ సినిమాకు దాదాపు 200 కోట్ల థియేటరికల్ బిజినెస్ అయింది. అంటే కనీసం ఈ సినిమా 400 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. అంటే ఇంకా 220 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయాలి.

నేడు రిలీజయిన మన శంకర వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోవడం, ఫ్యామిలీ ఎంటర్టైన్ అవ్వడంతో రాజాసాబ్ సినిమాకు కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ.. కరాటే నుంచి ఏపీలో మొదటి సమురాయ్ వరకు.. ఫొటోలు వైరల్..
