Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ.. కరాటే నుంచి ఏపీలో మొదటి సమురాయ్ వరకు.. ఫొటోలు వైరల్..
పవన్ కళ్యాణ్ తన యుక్త వయసు నుంచే అనేక రకాల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లో కూడా అనేక మార్షల్ ఆర్ట్స్ చూపించాడు. వాటితో ఫైట్ సీన్స్, విన్యాసాలు చేసాడు. మొదటి సినిమా నుంచి OG వరకు కూడా తన సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఎక్కడో ఒక చోట చూపించాడు పవన్. ఇటీవల పవన్ జపాన్ సంస్థ నుంచి పలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఏపీ నుంచి మొదటి సమురాయ్ గా నిలిచాడు. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు కూడా పొందాడు. దానికి సంబంధించిన వీడియో పవన్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అంటూ రిలీజ్ చేసారు. పిఠాపురంలో పవన్ మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ కూడా ప్రారంభిస్తారని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.









































