ప్లీజ్ అనుష్క.. నువ్వైనా పెళ్లి చేసుకో: ప్రభాస్

  • Published By: vamsi ,Published On : August 22, 2019 / 01:33 PM IST
ప్లీజ్ అనుష్క.. నువ్వైనా పెళ్లి చేసుకో: ప్రభాస్

Updated On : August 22, 2019 / 1:33 PM IST

ప్రభాస్.. అనుష్క.. వీరిద్దరి కాంబినేషన్ కు ఎదురులేదు. బిల్లా.. మిర్చీ.. బాహుబలి.. వీళ్ల క్రేజీ కాంబినేషన్ అంటే అభిమానులు పడి చచ్చిపోతారు. వీళ్లు ఇద్దరు బయట కూడా మంచి స్నేహితులు. అయితే తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని వీళ్లిద్దరు ఎంత చెబుతున్నా కూడా వారి ప్రేమకు సంబంధించిన వార్తలు మాత్రం ఆగట్లేదు.

ఈ క్రమంలోనేచ వీరిద్దరి మధ్య లవ్ ఉందంటూ పలుమార్లు వార్తలు వినిపించాయి. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా ప్రభాస్ క్రేజ్ తెచ్చుకోవడంతో ఈ వ్యవహారంపై వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి, వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ బాలీవుడ్ కూడా గాసిప్పులు రాసేశాయి.

లేటెస్ట్ గా  ‘సాహో’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ప్రభాస్.. మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఈ విషయంపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్ గా ఈటీ టైమ్స్‌ ఇంటర్వూలో కూడా ప్రభాస్ కు అనుష్కతో రిలేషన్‌షిప్‌ ఏంటనే ప్రశ్న ఎదురైంది.

దీనికి సమాధానం ఇచ్చిన ప్రభాస్‌.. ‘ నేను లేదా అనుష్క ఎవరో ఒకరు.. ఎవరో ఒకరిని వేరువేరుగా పెళ్లి చేసుకుంటే తప్ప గాసిప్పులు ఆగేలా లేవు. ఈ విషయం గురించి అనుష్కతో ఓసారి మాట్లాడాలి. ఇదిగో అనుష్క ప్లీజ్.. నువ్వైనా తొందరగా పెళ్లి చేసుకో అని తనకు చెబుతాను అని ప్రభాస్ అన్నారు. అప్పుడే ఇటువంటి గాసిప్పులు ఆగుతాయి’ అంటూ సరదాగా చెప్పారు.