Salaar PVR Issue : సలార్ వర్సెస్ డంకీ.. పివిఆర్ గొడవ అయిపోయిందా? పివిఆర్‌లో సలార్ రిలీజ్ ఉన్నట్టేగా..

ప్రభాస్ అభిమానులు బాయ్ కాట్ పివిఆర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అలాగే షారుఖ్ ఖాన్, డంకీ సినిమాపై కూడా విమర్శలు చేశారు.

Salaar PVR Issue : సలార్ వర్సెస్ డంకీ.. పివిఆర్ గొడవ అయిపోయిందా? పివిఆర్‌లో సలార్ రిలీజ్ ఉన్నట్టేగా..

Prabhas Salaar Movie PVR Theaters Issue Solved Bookings Open in PVR

Updated On : December 21, 2023 / 6:08 PM IST

Salaar PVR Issue : షారుఖ్ ఖాన్(Shahrukh Khan) డంకీ(Dunki) సినిమా నేడు డిసెంబర్ 21న రిలీజవ్వగా రేపు డిసెంబర్ 22న ప్రభాస్(Prabhas) సలార్ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఏర్పడింది. డంకీ కేవలం హిందీ భాషలోనే రిలీజ్ అవుతుంది. సలార్ మాత్రం 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇద్దరు పెద్ద స్టార్లు, రెండు భారీ సినిమాలు ఉన్నప్పుడు కచ్చితంగా థియేటర్స్ ఇవ్వడంలో ఇబ్బందులు వస్తాయి.

అయితే ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం నార్త్ లో సలార్ సినిమాకు పివిఆర్ స్క్రీన్స్ ఇవ్వమని చెప్పడంతో నిన్నటి నుంచి ఈ వార్త వైరల్ గా మారింది. షారుఖ్, డంకీ సినిమా నిర్మాతలు సలార్ కి నార్త్ లో థియేటర్స్ ఇవ్వొద్దని పివిఆర్ ఓనర్ తో మాట్లాడి డీల్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో సలార్ నిర్మాతలు ఇదే జరిగితే సౌత్ మొత్తం పివిఆర్ లో సలార్ సినిమా రిలీజ్ కి ఇవ్వం అని డిసైడ్ అయినట్టు సమాచారం.

చిత్ర నిర్మాతలు కూడా సేల్ అయిన టికెట్స్ లిస్ట్ పెట్టగా అందులో పివిఆర్ సంస్థని మినహాయించి అని పోస్ట్ చేశారు. పివిఆర్ థియేటర్స్ లో ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. దీంతో ఈ విషయం అభిమానుల వరకు వెళ్లడంతో ప్రభాస్ అభిమానులు బాయ్ కాట్ పివిఆర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అలాగే షారుఖ్ ఖాన్, డంకీ సినిమాపై కూడా విమర్శలు చేశారు.

Also Read : Salaar Hawa : కాలేజీల్లో సలార్ హవా.. భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఉన్నారేంట్రా బాబు.. కంప్యూటర్ ల్యాబ్ లో..

సలార్ సినిమాకి నార్త్ లో థియేటర్స్ ఎక్కువ ఇవ్వకపోయినా పెద్ద నష్టం లేదు. కానీ సౌత్ లో, తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా పివిఆర్ లో రిలీజ్ అవ్వకపోతే ఆ సంస్థకి భారీ నష్టం ఖాయం. దీంతో పివిఆర్ సంస్థ దిగి వచ్చి, సలార్ నిర్మాతలతో, నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడారని సమాచారం. తాజాగా దీనిపై పివిఆర్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇందులో.. మీడియాలో వస్తున్న కథనాలన్నీ తప్పు. దేశం మొత్తం సలార్ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఈ సినిమా పివిఆర్ థియేటర్స్ లో రిలీజవుతుంది అని పోస్ట్ చేసింది. అలాగే టికెట్స్ కూడా ఓపెన్ చేశామని, బుక్ చేసుకోండి పివిఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిర్మాతలతో మాట్లాడిన తర్వాత, వివాదం సెటిల్ అయ్యాకే పివిఆర్ ఈ నిర్ణయం తీసుకుందని ట్రేడ్ వర్గాల సామాచారం.