Salaar : సలార్ క్రేజ్ మాములుగా లేదుగా.. టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఇది గమనించారా..?
సలార్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఇది గమనించారా..? ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Prabhas Salaar Part 1 Ceasefire craze paytm booking option surprises fans
Salaar : ప్రభాస్ సలార్ మొదటి భాగం మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ని పలకరించబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా పూర్తి యాక్షన్ కట్ తో మరో ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ ట్రైలర్ మూవీ లవర్స్ కి సినిమా పై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీ బుకింగ్స్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారా..? ఎప్పుడు టికెట్స్ కొనుగోలు చేద్దామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతానికి తెలుగు బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. అయితే ఓవర్ సీస్ తో పాటు బాలీవుడ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యిపోయాయి. దీంతో అక్కడి అభిమానులు ఫస్ట్ డేనే సినిమా చూసేందుకు టికెట్స్ ని బుక్ చేసేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఫ్యాన్స్ పేటిఎమ్ లో టికెట్స్ బుక్ చేస్తుంటే ఒక సర్‌ప్రైజ్ కనిపిస్తుంది. టికెట్ బుక్ చేయడానికి సీట్ సెలెక్ట్ చేసుకున్న తరువాత.. ఆ సీట్ ప్రభాస్ ఫోటోతో కనిపిస్తుంది. ఈ కొత్త అప్డేట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also read : Salaar : సలార్ ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని.. ప్రశాంత్ నీల్ భార్య ఆగ్రహం.. పోస్ట్ వైరల్
Super Raa ? ??? Paytm..#Salaar #Prabhas pic.twitter.com/arZ9sX3pVJ
— Fukkard (@Fukkard) December 18, 2023
ఇది ఇలా ఉంటే, తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో కొంతమంది అభిమానులు ఓ విషయాన్ని గమనించారు. ట్రైలర్ లోని ఓ సీన్ లో ఒక వ్యక్తిని బ్యాక్ షాట్ నుంచి చూపించారు. ఆ కటౌట్ చూస్తుంటే యశ్ లాగా కనిపిస్తున్నారు. ఈ బ్యాక్ షాట్‌ని, కేజీఎఫ్ లోని యశ్ బ్యాక్ షాట్‌ని కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్, సలార్ మధ్య ఎటువంటి కనెక్షన్ లేదని ఇటీవల కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ కేవలం కేజీఎఫ్, సలార్ కి కనెక్షన్ లేదని చెప్పారు గాని, సలార్ మూవీలో యశ్ లేడని చెప్పలేదు కదా. యశ్ సలార్ లో కనిపించాలంటే.. రాకీ భాయ్ గానే కనిపించాలా ఏంటి? మరో కొత్త పాత్రలో, సలార్ వరల్డ్ కి సంబంధించిన ఒక కొత్త రోల్ తో కనిపించే అవకాశం కూడా ఉంది కదా.