Prabhas Salaar teaser release date gone viral
Salaar : ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిపించుకున్న ప్రశాంత్ నీల్ (Prasanth Neel) ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆదిపురుష్ వంతు అయ్యిపోవడంతో ఇప్పుడు వరసలో ఉన్న సలార్ మూవీ పై అందరి దృష్టి పడింది. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ తప్ప మరొక అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు.. టీజర్ లేదా గ్లింప్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
Prabhas : ప్రాజెక్ట్ Kలో మహా విష్ణువు అవతారంలో కనిపించనున్న ప్రభాస్..!
కాగా జులై నెలలో ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ కాబోతుంది అంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ టీజర్ వచ్చే తేదీ ఇదే అంటూ ఒక డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ టీజర్ ని జులై 7న రిలీజ్ చేయబోతున్నారట. త్వరలోనే ఇదే డేట్ ని కన్ఫార్మ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం. మరి మేకర్స్ ఏ డేట్ ని ఖరారు చేస్తారో చూడాలి. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
Peddha Kapu 1 Teaser : ఎన్టీఆర్ రాజకీయ స్పీచ్‌తో పెదకాపు 1 టీజర్.. రా అండ్ రస్టిక్ తో..
హొంబాలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఆమధ్య ఈ సినిమా ఇటలీలో షూటింగ్ జరుపుకోగా.. అక్కడ మీడియా ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కబోతుందంటూ రాసుకు రావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.