Salaar Collections : నైజంలో సలార్ రికార్డు.. వరల్డ్ వైడ్‌గా రెండు వారాల కలెక్షన్స్ ఎంతంటే..
సలార్ రెండు వారలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పటివరకు ఈ చిత్రం ఎంతటి కలెక్షన్స్ అందుకుంది..?

Prabhas Salaar two week Collections and Nizam gross report details
Salaar Collections : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా రూపొందించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో భారీ విజయం అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. మొదటి రోజే ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని రికార్డ్ సెట్ చేసింది.
తాజాగా ఈ చిత్రం రెండు వారలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పటివరకు ఈ చిత్రం ఎంతటి కలెక్షన్స్ అందుకుంది..? ఆల్రెడీ 600 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు 700 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రెండు వారాల్లో రూ.659.69 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ పేర్కొన్నారు.
Also read : Prabhas : బాబోయ్.. మన ప్రభాసా ఇలా విష్ చేసింది.. మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ పోస్ట్..
కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 345 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ చిత్రం సుమారు 20 కోట్ల షేర్ ని అంటే 41 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, ఈ చిత్రం నైజంలో రికార్డుని అందుకుంది.
??? ???????? ?????? ? ???????? ??????????? ❤️?❤️?#BlockbusterSalaar crosses the ??? ????? ????? in Nizam ??
– https://t.co/N5FRW6NoU6Nizam Release by @MythriOfficial ?#Salaar #SalaarCeaseFire#Prabhas #PrashanthNeel… pic.twitter.com/xlPeEg1mZn
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2024
ఒక నైజంలోనే ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ నైజంలో ఈ ఫీట్ సాధించినట్లు సమాచారం. ఇప్పుడు సలార్ తో ప్రభాస్ నైజంలో ఈ రికార్డుని అందుకోవడంతో అభిమానులు సందడి చేస్తున్నారు. కాగా వచ్చే వారం వరకు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద చెప్పుకోదగ్గ సినిమా రిలీజ్‌లు ఏం లేవు. మరి ఈ వారంలో సలార్ 700 కోట్ల మార్క్‌ని, బ్రేక్ ఈవెన్‌ని సాదిస్తుందేమో చూడాలి.