Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే.. యానిమల్ తర్వాత సందీప్ వంగ టార్గెట్ ‘స్పిరిట్’
ఇటీవల ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టడం, సందీప్ అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించడంతో స్పిరిట్ సినిమా ఉంటుందా లేదా అని సందేహాలు వచ్చాయి.

Prabhas Sandeep Vanga Spirit Movie Music Director Announced
Prabhas Spirit Movie : ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో సలార్(Salaar) పార్ట్ 1 సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత కల్కి(Kalki), మారుతి(Maruthi) సినిమాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి(Arjun Reddy) డైరెక్టర్ సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటిసారి ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.
సందీప్ వంగ అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ లా తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు. దీంతో వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం త్వరలో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత స్పిరిట్, అల్లు అర్జున్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇటీవల ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టడం, సందీప్ అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించడంతో స్పిరిట్ సినిమా ఉంటుందా లేదా అని సందేహాలు వచ్చాయి.
తాజాగా స్పిరిట్ చిత్రయూనిట్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ స్పిరిట్ సినిమాకు హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ అని చిత్రయూనిట్ కి సంబంధించిన వారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సందీప్ వంగ చేసిన సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు ఇవ్వకపోయినా సినిమాలకు స్కోర్ మాత్రం హర్షవర్ధన్ అందించాడు. హర్షవర్ధన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల రవితేజ రావణాసుర సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు స్పిరిట్ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రకటించారు. అయితే సందీప్ వంగ అన్ని సినిమాలలాగే దీనికి కూడా ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడా లేక పాటలకు కూడా సంగీతం ఇస్తాడేమో చూడాలి.
Jayaprada : నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష ..
అయితే ఈ అప్డేట్ తో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. యానిమల్ సినిమా తర్వాత సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ తీస్తాడని సమాచారం. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నారు.