Prabhas : పెదనాన్న గారి దగ్గర నుంచి అదే నేర్చుకున్నా..
ప్రభాస్ అందరికి భోజనాలు బాగా పెడతాడని సంగతి తెలిసిందే. దీని గురించి బాలయ్య షోలో ప్రస్తావిస్తూ కృష్ణంరాజు సంస్మరణ సభకి భీమవరంలో పదివేల మందికి భోజనాలు పెట్టిన వీడియోని కూడా చూపించారు. దీనిపై ప్రభాస్ మాట్లాడుతూ........

Prabhas spoke about krishnamraju
Prabhas : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరు ఎపిసోడ్స్ ఇప్పటికే పూర్తికాగా ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ ని తీసుకొచ్చారు. ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడు అని తెలియడంతో ముందునుంచి ఈ ఎపిసోడ్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి ఫ్యాన్స్ కి మరింత జోష్ ఇచ్చింది ఆహా టీం.
ప్రభాస్ అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని చెప్పినా డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి అభిమానులకి ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇచ్చింది ఆహా. ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఆహా సర్వర్లు ఎక్కువ ఫ్లోటింగ్ తో క్రాష్ అయ్యాయి అంటే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
Prabhas : అప్పులు ఉన్నాయని ఆ సినిమా చేశా.. బాహుబలి ఒప్పుకున్నాక కూడా వేరే సినిమాలు చేశా..
ఇక ఎపిసోడ్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ప్రభాస్ నటుడిగా మారి 20 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులతో స్పెషల్ షూట్ చేసి ప్రోమో కూడా వేశారు. ప్రభాస్ సినిమాలు, పెళ్లి.. ఇలా అనేక టాపిక్స్ ప్రస్తావించాడు బాలయ్య. ఇక ప్రభాస్ అందరికి భోజనాలు బాగా పెడతాడని సంగతి తెలిసిందే. దీని గురించి బాలయ్య షోలో ప్రస్తావిస్తూ కృష్ణంరాజు సంస్మరణ సభకి భీమవరంలో పదివేల మందికి భోజనాలు పెట్టిన వీడియోని కూడా చూపించారు. దీనిపై ప్రభాస్ మాట్లాడుతూ.. ఇది తాతగారు, పెదనాన్న గారి దగ్గరనుంచి వచ్చింది. పెదనాన్న ఇంటికి ఎవరు వచ్చినా ముందు భోజనం పెడతారు. ఇంటికి శత్రువు వచ్చినా ముందు భోజనం పెట్టు, గొడవలు ఉంటే బయట చూసుకో అని చెప్పారు పెదనాన్న. అందరికి భోజనాలు పెట్టడం పెదనాన్న గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను అని అన్నాడు.