Raja Saab : ‘రాజాసాబ్’ షూటింగ్ సెట్ నుంచి ఫోటో వైరల్.. రెబల్ స్టార్ ఏం నవ్వుతున్నాడ్రా బాబు..
ఫ్యాన్స్ అంతా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

Prabhas The Raja Saab Movie Sets Photo Shares Director Maruthi and Thaman in Photos
Raja Saab : ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో రాజాసాబ్ అనే సినిమాతో రాబోతున్నాడు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ సినిమా చేస్తుండటం, తాత గెటప్ లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ప్రభాస్ రాజాసాబ్ టీజర్ జూన్ 16 ఉదయం 10.52 గంటలకు రిలీజ్ అవ్వనుంది. దీంతో ఫ్యాన్స్ అంతా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ సూపర్ ఫోటో రిలీజ్ చేసారు. ప్రభాస్, డైరెక్టర్ మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సెట్లో కూర్చొని సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. రెబల్ స్టార్ కూడా ఫుల్ గా నవ్వుతుండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ప్రభాస్ రాజాసాబ్ సినిమా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతుండగా ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.
All smiles now… 😍
but what’s coming will send shivers down your spine 🔥Here’s a working still from #TheRajaSaab sets ❤️#TheRajaSaabTeaser on June 16th at 10:52AM 💥#TheRajaSaabOnDec5th pic.twitter.com/WtHvEBV83Z
— Director Maruthi (@DirectorMaruthi) June 13, 2025