Prabhas The Raja Saab release date fix
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాల్లో నటిస్తూ యమా బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న మూవీల్లో ది రాజా సాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.
అప్పుడెప్పుడో ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా అదిరిపోయే స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్, విడుదల తేదీని ప్రకటించారు. టీజర్‌ను జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nitya Shetty : సినిమా ఆడిషన్స్ లో ముక్కు సర్జరీ చేసుకోమన్నారు.. లావుగా ఉన్నాను అన్నారు..
The dates of the REBEL FESTIVAL 🔥
⁰Teaser on JUNE 16th at 10:52 AM⁰Worldwide Grand Release – DECEMBER 5th#Prabhas #TheRajaSaab #TheRajaSaabOnDec5th pic.twitter.com/pakHM2hysr— The RajaSaab (@rajasaabmovie) June 3, 2025
ఈ చిత్రంలో సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్, రిద్ది కుమార్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.