Nitya Shetty : సినిమా ఆడిషన్స్ లో ముక్కు సర్జరీ చేసుకోమన్నారు.. లావుగా ఉన్నాను అన్నారు..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమా ఆడిషన్స్ లో తనకు ఎదురైన అనుభవాలు తెలిపింది.

Nitya Shetty Faces Body Shaming in Movie Auditions
Nitya Shetty : దేవుళ్ళు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమ్ తెచ్చుకుంది నిత్యా శెట్టి. దేవుళ్ళుతో పాటు అంజి, చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్, మాయ.. లాంటి అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది నిత్యా శెట్టి. చైల్డ్ ఆర్టిస్ట్ గానే నంది అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు నిత్యా శెట్టి హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తుంది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమా ఆడిషన్స్ లో తనకు ఎదురైన అనుభవాలు తెలిపింది.
Also Read : Amardeep – Supritha : అమర్ దీప్ – సుప్రీత జంటగా సినిమా.. టైటిల్ భలే ఉందే..
నిత్యాశెట్టి మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్ట్ కదా నేను ఇప్పుడు సినిమాల్లోకి వస్తే హీరోయిన్ గా పిలిచి ఛాన్సులు ఇస్తారు అనుకున్నా. కానీ రియాలిటీ వేరు. నేను చేసే ఇన్ఫోసిస్ జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చా. చాలా ఆడిషన్స్ ఇచ్చా. ఓ ఆడిషన్ లో నా ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేసారు. ముక్కు సర్జరీ చేసుకొని వస్తే ఛాన్స్ ఇస్తామన్నారు. ఇంకోసారి దేవుళ్ళు పాప కదా హీరోయిన్ గా సెట్ అవ్వదు అని అన్నారు. ఇంకోసారి నేను కాస్త నల్లగా ఉన్నాను, ఫెయిర్ లేను అని అన్నారు.
హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఓ పిట్టకథ’కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. డైరెక్టర్ నన్ను ఒకే చేసినా నిర్మాతలు లావుగా ఉన్నాను అని అన్నారు. నన్ను ఓకే చేసి షూటింగ్ కి వెళ్లేసరికి ఛాలెంజ్ గా తీసుకొని 20 రోజుల్లో ఆరు కిలోలు తగ్గి చూపించాను అని తనకు ఎదురైన అనుభవాలు తెలిపింది.
Also See : Supritha : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత.. సినిమా ఈవెంట్లో ఇలా నలుపు చీరలో..