Prabhas : రెండు భాగాలుగా బాహుబలి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్..

ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం రెండు రాష్ట్రలో ఉన్న ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. అయితే ఈ బాహుబలి ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుంది అంటా...

Prabhas unstoppable episode telecast in two parts

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం రెండు రాష్ట్రలో ఉన్న ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు రిలీజ్ అయ్యి అందర్నీ ఎంతగానో ఆకట్టుకోవడంతో, ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్‌ని చూస్తామా అని ఎంతో ఆశక్తిని చూపుతున్నారు జనరల్ ఆడియన్స్ సైతం. దీంతో ఈ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు.

Prabhas: ప్రభాస్-సుకుమార్ ప్రాజెక్ట్‌పై నిర్మాతల క్లారిటీ..!

అయితే ఈ బాహుబలి ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుంది అంటా. ఈ విషయాన్ని అధికారికంగా ఆహా టీం నేడు ప్రకటించింది. “కంటెంట్ ఎంత బాగుందంటే ఎడిట్ చేయడానికి ఎవ్వరు ఒప్పుకోలేదు. దీంతో అదే ఎక్స్‌క్లూసివ్ ఎక్స్‌పిరెన్స్ మీకు అందించేందుకు సెట్స్‌లో జరిగిన మొత్తం బాహుబలి ఎపిసోడ్ కార్యక్రమాన్ని మీకు రెండు భాగాలుగా అందిస్తున్నాము” అంటూ ట్వీట్ చేశారు ఆహా టీం.

ది బిగినింగ్ ఎపిసోడ్‌ని ఈ నెల 30న, ది కన్‌క్లూజన్ ఎపిసోడ్‌ని జనవరి 6న రిలీజ్ చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఇక ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. కాగా ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా పాల్గొనున్నాడు. ప్రోమోలతోనే రికార్డులు సృష్టించిన ఈ ఎపిసోడ్.. ఇప్పుడు రెండు ఎపిసోడ్‌లుగా వస్తూ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.