You Spoil Me : భాగ్యశ్రీకి పూతరేకులు పంపించిన ప్రభాస్

బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీట్లు పంపించారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రుచికరమైన హైదరాబాదీ స్వీట్లు అందుకున్నాను..థాంక్స్ ప్రభాస్..అంటూ ట్వీట్ చేశారు.

You Spoil Me : భాగ్యశ్రీకి పూతరేకులు పంపించిన ప్రభాస్

Sweets

Updated On : July 2, 2021 / 10:16 AM IST

Prabhas And Bhagyashree : బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీట్లు పంపించారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రుచికరమైన హైదరాబాదీ స్వీట్లు అందుకున్నాను..థాంక్స్ ప్రభాస్..అంటూ ట్వీట్ చేశారు. తన అభిరుచిని మార్చేశారు అంటూ వెల్లడించారు. భాగ్యశ్రీకి..పూతరేకులను పంపించారు ప్రభాస్.

అభిమానులు డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే ప్రభాస్..ఇంట్లో గోదావరి వంటకాలు ఫేమస్. షూటింగ్ లో ఉన్న వారికి, ఇతర నటులకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ పంపిస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ పలు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో రాధే శ్యామ్ ఒకటి. ఈ సినిమాలో భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ ఐదు భాషల్లో రూపొందుతోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.