MAA Association: కొత్త అసోసియేషన్ పెట్టట్లేదు.. ఆత్మ, ప్రేతాత్మలేం లేవు! -ప్రకాష్ రాజ్

మా ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ కొత్తగా మరో అసోసియేషన్ పెట్టబోతున్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టిపారేశారు.

MAA Association: కొత్త అసోసియేషన్ పెట్టట్లేదు.. ఆత్మ, ప్రేతాత్మలేం లేవు! -ప్రకాష్ రాజ్

Prakash raj resigns to MAA membership

Updated On : October 12, 2021 / 6:20 PM IST

MAA Association: మా ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ కొత్తగా మరో అసోసియేషన్ పెట్టబోతున్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. కొత్త అసోసియేషన్ పెట్టే ఆలోచనే లేదని అన్నారు ప్రకాష్ రాజ్. ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మలు ఏవీ లేవని అన్నారు ప్రకాష్ రాజ్. మా అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త అసోసియేషన్ పెట్టబోతున్నట్లు వచ్చిన వార్తలు ఒట్టి రూమర్లేనని కొట్టిపారేశారు.

తన ప్యానెల్ సభ్యులు రాజీనామా చేసింది మాత్రం మా లో మళ్లీ మళ్లీ గొడవలు జరగకుండా ఉండేందుకేనని, రాజీనామా చేసినా కూడా ప్రశ్నించడం మాత్రం ఆపేదే లేదన్నారు ప్రకాష్ రాజ్. రెండేళ్లు వేచి చూస్తామని, వారు చేసే పనులకు అడ్డుపడబోమని అన్నారు.

అయితే, చెప్పిన హామీలు అమలు చెయ్యకుంటే మాత్రం ప్రశ్నిస్తామని అన్నారు. రాజీనామాలను బాధతో కాదు బాధ్యతతో చేశామని, మా సభ్యులు సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇక ‘మా’ అసోసియేషన్‌లోనే ఉంటానని, రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకుంటానని, అయితే, తెలుగు వాడే మా ఎన్నికల్లో పోటీ చెయ్యాలని, అధ్యక్షులు కావాలనే బైలాస్ మార్చకుంటే, రాజీనామాను వెనక్కి తీసుకుంటానని అన్నారు ప్రకాష్ రాజ్.