Pranayagodari Song : ‘ప్రణయగోదారి’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. కోటి చేతుల మీదుగా లాంచ్..
తాజాగా ప్రణయగోదారి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేసారు.

Pranaya Godavari Movie First Song Released by Music Director Koti
Pranaya Godari Song : కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కుతున్న సినిమా ప్రణయగోదారి. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా PL విఘ్నేష్ దర్శకత్వంలో పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రణయ గోదారి’. సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Jr NTR : ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో చూశారా? నిక్కర్ వేసుకొని ఈవెంట్ కి వచ్చి..
ప్రణయ గోదారి సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేసారు. ‘కలలో కలలోయమ్మ కలలు..’ అంటూ మెలోడీగా సాగింది ఈ పాట. ఈ లవ్ మెలోడీ సాంగ్ ని మార్కండేయ రాసి సంగీతం అందించగా సింగర్ శ్రీకృష్ణ పాడారు. గోదావరి అందాలు, న్యాచురల్ లొకేషన్స్ లో ఈ సాంగ్ ని షూట్ చేసారు.
ఇక ఈ సాంగ్ ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా లాంచ్ చేశారు. పాట లాంచ్ చేసిన అనంతరం కోటి మాట్లాడుతూ.. ప్రణయగోదారి నుంచి వచ్చిన ఈ సాంగ్ వినడంతో పాటు చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. పాటలో లిరిక్స్, బీట్ కు తగ్గట్టు సన్నివేశాలు, నటీనటుల వేషధారణ బాగా కుదిరాయి. మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.
Ace music director #Koti Garu Launched the amazing melody #KalaloKalloyamma from #Pranayagodari ?
▶️https://t.co/f5g1QzI8j7#Sadan #PriyankaPrasad@saikumaractor #30YearsPrithvi#JabardastRajamouli #SunilRavinuthala#PLVignesh#ParamallaLingaiah #PLVCreations#Markandeya… pic.twitter.com/ERcYHD9rMX
— SR Promotions (@SR_Promotions) June 22, 2024