Akshaye Khanna in Mahakali : తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న ధురంధర్ విలన్.. ప్రశాంత్ వర్మ మహకాళిలో కీలక పాత్ర
Akshaye Khanna in Mahakali : ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా మహాకాళి చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన లుక్ కి సంబంధించిన ఫోటోని దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేశారు.
Prasanth Varma reveals Akshaye Khanna as Shukracharya in Telugu debut Mahakali
Akshaye Khanna in Mahakali : బాలీవుడ్ ప్రముఖ నటుడు, ధురంధర్ సినిమాలో విలన్ పాత్రలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ ఖన్నా.. కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు.. త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో సందడి చేయబోతున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాకాళి సినిమాలో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ధురంధర్’ పార్ట్ 1లో అక్షయ్ ఖన్నా.. రెహ్మాన్ డెకాయిట్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.
ఈ క్రమంలో మార్చి 28న అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మహాకాళి చిత్రంలో అక్షయ్ ఖన్నా పాత్ర గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమాలో అక్షయ్ లుక్ ని రివీల్ చేశారు. అక్షయ్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోని రిలీజ్ చేశారు. దీంతో పాటు అక్షయ్ ఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అలానే మహాకాళి చిత్రంలో అక్షయ్ ఖన్నా.. ‘శుక్రాచార్యుడి’ పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ఈ ఫోటోతో పాటు.. ‘‘నిజమైన ప్రతిభకు హంగు, ఆర్భాటాలు అవసరం లేదని నిరూపించే నటుడు అక్షయ్ ఖన్నా సర్. మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మన కాంబినేషన్ లో వస్తోన్న ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చూపించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంటూ పోస్ట్ చేశారు.
మహాకాళి సినిమా కోసం అక్షయ్ ఖన్నా రాక్షస గురువు శుక్రాచార్యుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు రెడీ అయ్యారు. అందుకు తగ్గట్టుగా పూర్తిగా మేకోవర్ అయ్యారు. పురాణాల్లోని అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రకు.. అక్షయ్ తనదైన శైలిలో గాంభీర్యాన్ని అద్దనున్నారని ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. ‘మహాకాళి’ చిత్రంలో భూమి శెట్టి లేడీ సూపర్ హీరోగా నటిస్తోంది. పురాణ గాథలకు ఆధునిక సూపర్ హీరో టచ్ ఇచ్చి రూపొందిస్తున్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
