NTR 31 : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. NTR 31 అప్డేట్.. ప్రశాంత్ నీల్ తో సినిమా మొదలయ్యేది అప్పట్నుంచే..
NTR 31వ సినిమా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో అని గతంలోనే ప్రకటించారు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 31వ సినిమా అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.

Prashanth Neel and NTR Movie shoot starting update
Prashanth Neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో NTR 30వ సినిమాలో నటిస్తున్నాడు. నిన్నే ఈ సినిమా టైటిల్ దేవర(Devara) అని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, అందాల భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత NTR 31వ సినిమా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో అని గతంలోనే ప్రకటించారు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 31వ సినిమా అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా 2024 మార్చ్ నుంచి షూటింగ్ మొదలవ్వబోతుందని ప్రకటించారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ దేవర సినిమాతో ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే వీరి కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది. సలార్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. దేవర వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ప్రశాంత్ నీల్ సలార్ రిలీజయ్యాక ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ చేసి వచ్చే మార్చ్ లో షూట్ కి వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Team #NTR31 wishes @tarak9999 a very Happy Birthday ??
On to the sets from March 2024 ??#HappyBirthdayNTR#PrashanthNeel @NTRArtsOfficial pic.twitter.com/Mi769WTE2o
— Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2023