NTR – Neel : ఎన్టీఆర్‌తో సినిమా పై అప్‌డేట్ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్.. ఏ జాన‌రో తెలుసా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే.

Prashanth Neel confirms that periodical backdrop Film with NTR

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది. యాక్ష‌న్ నా, కామెడీ నా, ప్రేమ క‌థానా అనే ప్ర‌శ్న‌లు ఉద‌యించ‌గా.. తాజాగా స‌మాధానం దొరికింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అస‌లు విష‌యాన్ని చెప్పేశాడు.

అప్ప‌ట్లో ప్రశాంత్ నీల్ మైథాల‌జీ బ్యాక్ డ్రాప్‌లో ఓ సినిమా చేయాల‌ని అనుకున్నాడు. అది ఎన్టీఆర్ హీరోగా చేయ‌బోయే సినిమా కోస‌మేనా అనే ప్ర‌శ్న ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శాంత్ నీల్‌కు ఎదురైంది. అప్పుడు ప్ర‌శాంత్ నీల్ ఇలా స‌మాధానం ఇచ్చారు.

Ram Charan – Pawan Kalyan : నేను సంక్రాంతికి రాకపోతే బాబాయ్ సినిమా తీసుకొచ్చేవాడ్ని.. పవన్ పేరు వినగానే అమెరికాలో అరుపులు..

‘కాదు.. అది మైథాల‌జీ బ్యాక్ డ్రాప్ కాదు. ఎన్టీఆర్ హీరోగా చేయ‌బోయేది పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది.’ అని చెప్పాడు. అయితే.. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంద‌నే విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్ర షూటింగ్ పూర్తి అయిన త‌రువాత ప్ర‌శాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి లు నిర్మించ‌నున్నారు. ఇక ఈ చిత్రానికి డ్రాగ‌న్ అనే టైటిల్ ప్ర‌చారం ఉంది.

Mohan Babu : మోహన్ బాబు పై‌ కేసు నమోదు చేసాం.. వాళ్ళది ఇంటి సమస్య.. తెలంగాణ డీజీపీ కామెంట్స్..