Ram Charan – Pawan Kalyan : నేను సంక్రాంతికి రాకపోతే బాబాయ్ సినిమా తీసుకొచ్చేవాడ్ని.. పవన్ పేరు వినగానే అమెరికాలో అరుపులు..

అమెరికాలో కూడా పవన్ పేరు వినిపిస్తే ఆ ప్రాంగణం అభిమానుల అరుపులతో దద్దరిల్లిపోతుంది.

Ram Charan – Pawan Kalyan : నేను సంక్రాంతికి రాకపోతే బాబాయ్ సినిమా తీసుకొచ్చేవాడ్ని.. పవన్ పేరు వినగానే అమెరికాలో అరుపులు..

Ram Charan Talked about Pawan Kalyan in America Game Changer Event

Updated On : December 22, 2024 / 2:22 PM IST

Ram Charan – Pawan Kalyan : నేడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్టు భారీగా జనాలు వచ్చారు. చరణ్ అభిమానులు, మెగా ఫ్యాన్స్ తో పాటు అక్కడి తెలుగు ప్రజలు చరణ్ ఈవెంట్ కి వచ్చి సందడి చేశారు. పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ వినపడ్డా ఆడియన్స్ నుంచి అరుపులు ఓ రేంజ్ లో వినిపిస్తాయని తెలిసిందే. అసలే ఇటీవల ఎన్నికల విజయం తర్వాత, డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ రేంజ్ మరింత పెరిగింది.

Also Read : Ram Charan : థ్యాంక్యూ అమెరికా.. చరణ్ సెల్ఫీ వీడియో వైరల్.. అమెరికా ఈవెంట్లో ఆ జనాలు ఏందిరా నాయనా..

ఇప్పుడు అమెరికాలో కూడా పవన్ పేరు వినిపిస్తే ఆ ప్రాంగణం అభిమానుల అరుపులతో దద్దరిల్లిపోతుంది. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి అరవడంతో రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను కూడా OG సినిమా కోసం వెయిటింగ్. ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే ఎలా అయినా కళ్యాణ్ బాబాయ్ ని ఫోర్స్ చేసి ఈ సంక్రాంతికి ఆయన సినిమా వచ్చేలా చేసేవాడ్ని అని అన్నారు.

దీంతో పవన్ పేరు, OG పేరు వినగానే హాల్ అంతా అరుపులతో దద్దరిల్లిపోయింది. అమెరికాలో కూడా జనసేనాని రేంజ్ మాములుగా లేదుగా అని ఆ వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.