Ram Charan : థ్యాంక్యూ అమెరికా.. చరణ్ సెల్ఫీ వీడియో వైరల్.. అమెరికా ఈవెంట్లో ఆ జనాలు ఏందిరా నాయనా..

ఈవెంట్ అయ్యాక చివర్లో రామ్ చరణ్ మాట్లాడిన తర్వాత ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

Ram Charan : థ్యాంక్యూ అమెరికా.. చరణ్ సెల్ఫీ వీడియో వైరల్.. అమెరికా ఈవెంట్లో ఆ జనాలు ఏందిరా నాయనా..

Ram Charan Shares A Selfie Video from Game Changer America Pre Release Event

Updated On : December 22, 2024 / 1:53 PM IST

Ram Charan : నేడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరిగింది. అయితే ఈవెంట్ అధికారిక లైవ్ ఇవ్వకపోయినప్పటికి ఈవెంట్ నుంచి పలు వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. అమెరికా ఛానల్స్ లో ఈ వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఈవెంట్ ని భారీగా నిర్వహించారు. చరణ్ ఫ్యాన్స్, అక్కడి తెలుగు వాళ్ళు భారీగా వచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే అమెరికాలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read : Telangana DGP – Allu Arjun : అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు.. హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం..

ఈవెంట్ కు రామ్ చరణ్, శంకర్, తమన్, దిల్ రాజు.. ఇలా గేమ్ ఛేంజర్ టీమ్ అంతా వచ్చారు. అయితే ఈవెంట్ అయ్యాక చివర్లో రామ్ చరణ్ మాట్లాడిన తర్వాత ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ సెల్ఫీ వీడియోలో థ్యాంక్యూ అమెరికా అంటూ అక్కడి ఫ్యాన్స్ కి, ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. ఆ వీడియోని షేర్ చేస్తూ.. థ్యాంక్యూ సో మచ్ అమెరికా.. మోస్ట్ మెమరబుల్ నైట్. రాజేష్ కళ్లేపల్లి & టీం ఇంతమంది ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్యూ అని తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో రామ్ చరణ్ పోస్ట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan)

అయితే ఈ ఈవెంట్ కి భారీగా జనాలు వచ్చారు, చరణ్ సెల్ఫీ వీడియోలో వెనుక చాలా మంది జనాలు ఉండటం, ఈవెంట్ నుంచి కూడా భారీగా జనాలు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అమెరికాలో తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడమే గ్రేట్ అంటే.. ఆ ఈవెంట్ కి ఈ రేంజ్ లో భారీగా జనాలు రావడం మాములు విషయం కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ జనాలు ఏందిరా బాబు అంతమంది వచ్చారు అమెరికానా, ఆంధ్రానా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. ఈ ఈవెంట్ తో అమెరికాలో గేమ్ ఛేంజర్ సినిమాకు భారీ హైప్ వచ్చినట్టే .