NTR31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. 2024 ఏప్రిల్..!
'NTR31' మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్.

Prashanth Neel NTR movie update given by mythri movie makers
NTR31 : RRR తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తరువాత ‘వార్ 2’, ‘NTR31’ సినిమాల్లో నటించాల్సి ఉంది. అభిమానులు ఈ రెండు సినిమాలు కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్న ‘NTR31’ కోసం ఎంతో క్యూరియాసిటీతో చూస్తున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఈ నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో పట్టాలు ఎక్కించబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాని మైత్రీ మేకర్స్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ కూడా నిర్మించబోతున్నట్లు తెలియజేశారు. ఇక నిన్న దేవర రెండు పార్ట్స్ అంటూ అప్డేట్. నేడు ఈ మూవీ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.
Also Read : Raviteja : అప్పుడు రవితేజని కుదరదు.. పొమ్మన్న నటుడు.. ఇప్పుడు మీడియా ముందు సారీ చెప్పి..
The most awaited project of @tarak9999 & #PrashanthNeel will commence in April, 2024 ❤️?
The prestigious high-octane spectacle will create a new benchmark in Indian Cinema ??#NTRNeel ?@NANDAMURIKALYAN @NTRArtsOfficial pic.twitter.com/CxTPchxOPz
— Mythri Movie Makers (@MythriOfficial) October 5, 2023
దేవర షూటింగ్ కూడా వచ్చే ఏడాది మార్చ్ వరకు జరిగే అవకాశం ఉంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత ‘వార్ 2’ షూటింగ్ పాల్గొంటాను అని కూడా ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది. అంటే వార్ అండ్ ఎన్టీఆర్-31 ని ఒకేసారి పట్టాలు ఎక్కించి షూటింగ్ జరపనున్నాడని తెలుస్తుంది. ఏదేమైనా ఎన్టీఆర్ స్పీడ్ తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ తో తెగ సందడిగా ఉంది.