Prashanth neel: నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయంటారు.. ఆ కామెంట్స్ విన్నప్పుడు.. నాకు నచ్చింది చేస్తాను
తన సినిమాల గురించి వస్తున్న కామెంట్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ నీల్(Prashanth neel).
- V Santhosh Kumar
- Published on- May 20, 2026 / 06:51 PM IST
Prashanth varma shocking comments about dark theme setting
- సినిమాలు ఒకేలా ఉన్నాయనడం నిజం కాదు
- కథల పరంగా నావన్నీ వైవిధ్యమైన చిత్రాలు
- ఎమోషన్స్‌కే నా సినిమాల్లో ప్రథమ ప్రాధాన్యత
Prashanth neel: టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా టీజర్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రేజీ అప్డేట్ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమాలపై వస్తున్న విమర్శలు, అలాగే ‘డ్రాగన్’ సినిమా కథాంశంపై ఆయన చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
తన సినిమాలు అన్నీ ఒకేలా, ఒకే డార్క్ థీమ్‌లో ఉంటాయనే నెటిజన్ల కామెంట్స్‌పై ప్రశాంత్ నీల్ సూటిగా స్పందించారు. “నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయన్న మాటలు విన్నప్పుడు, నాకేమో అలా అనిపించదు. బహుశా కలర్ ప్యాలెట్, నా ప్రెసెంటేషన్ స్టైల్ వల్ల ప్రేక్షకులకు అలా అనిపించవచ్చు. కానీ, కథల పరంగా చూస్తే ‘కేజీఎఫ్’, ‘సలార్’, ఇప్పుడు తీస్తున్న ‘డ్రాగన్’.. ఒకదానికొకటి అస్సలు సంబంధం లేని విభిన్నమైన కథలు” అని ఆయన స్పష్టం చేశారు.
తన మేకింగ్‌లో ఎప్పుడూ కథలోని ఎమోషన్స్‌కే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ప్రశాంత్ నీల్(Prashanth neel) చెప్పారు. బయట ఎవరేమనుకున్నా, ఎలాంటి కామెంట్లు చేసినా తాను పెద్దగా పట్టించుకోనని, తనకు నచ్చిన కంటెంట్‌ను మాత్రమే నమ్మి స్క్రీన్ మీదకు తెస్తానని వెల్లడించారు. ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ ‘డ్రాగన్’ కూడా సరికొత్త ఎమోషనల్ యాక్షన్ రైడ్‌గా ఉండబోతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
