Mega 158: ‘మెగా 158’ గ్రాండ్ లాంచ్ .. మెగాస్టార్ కోసం ‘పెద్ది’ వస్తున్నాడు
మెగాస్టార్ 158(Mega 158) సినిమా ఓపెనింగ్ కి గెస్ట్ గా వస్తున్న రామ్ చరణ్.
Ram Charan to attend the launch of megastar Mega 158 as Chief Guest.
- రేపు చిరంజీవి, బాబీ సినిమా ప్రారంభం
- ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రాక
- కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ నిర్మాణంలో చిత్రం
Mega 158: టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్లలో ఒకటిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి- బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) మళ్లీ చేతులు కలిపారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాత్కాలికంగా మెగా 158(Mega 158)గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రేపు, అనగా మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది.
ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ప్రధాన ఆకర్షణగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. తన తండ్రి సరికొత్త సినిమా ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేయనుండటంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం ప్రముఖ యూట్యూబ్ ఛానెల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించేలా మేకర్స్ ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి మెగా సెలబ్రేషన్స్‌ను తీసుకురావడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
