Ntr Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ చేయడం చాలా రిస్క్.. మూడేళ్లు పట్టింది సెట్ అవడానికి.. డార్క్ క్యారెక్టర్ ఇది.
డ్రాగన్ (Ntr Dragon)సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.
prashanth neel shocking comments on ntr charector in dragon movie
- ‘డ్రాగన్’ చేయడం ఎన్టీఆర్‌కు పెద్ద రిస్క్
- కథ సెట్ అవడానికి మూడేళ్లు పట్టింది
- సినిమాలో ఎన్టీఆర్ డార్క్ క్యారెక్టర్
Ntr Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్(Ntr Dragon)’ సినిమా టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఈ సినిమా చేయడం చాలా పెద్ద రిస్క్ అని, కథ విన్న తర్వాత ఆయన ఓకే అనడానికి చాలా సమయం పట్టిందని నీల్ వెల్లడించారు.
Mega 158: ‘మెగా 158’ గ్రాండ్ లాంచ్ .. మెగాస్టార్ కోసం ‘పెద్ది’ వస్తున్నాడు
ఈ ప్రాజెక్ట్‌ను లైన్లోకి తెచ్చి, కథను పూర్తిగా సెట్ చేయడానికి తనకు దాదాపు మూడేళ్ల సమయం పట్టిందని దర్శకుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ కేవలం ఒక కమర్షియల్ హీరోగా కాకుండా, నటుడిగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికే ఈ రోల్‌ను ఒప్పుకున్నారని చెప్పారు. ఈ సినిమాలో హీరో పాత్ర చాలా విభిన్నంగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ ‘డార్క్ క్యారెక్టర్’గా ఉంటుందని స్పష్టం చేశారు.
సినిమా క్లైమాక్స్ వచ్చే వరకు అసలు ఎన్టీఆర్ ఇలాంటి పాత్రను ఎందుకు ఒప్పుకున్నారో ప్రేక్షకులకు అర్థం కాదని, అంతటి సస్పెన్స్, డ్రామా ఇందులో ఉంటాయని నీల్ లీక్ ఇచ్చారు. థియేటర్లలో ఎండ్ కార్డ్ పడే సమయానికి ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ అవుతారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రశాంత్ నీల్ చేసిన ఈ వ్యాఖ్యలతో ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి.
